ఇటీవల కాలంలో భార్య చేతిలో మోసపోతున్న అమాయకపు భర్తల గురించి కథలు విన్నాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పురుషులు..తమ భార్యల చేతుల్లో మోసపోయిన సంగతి విదితమే. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తి కథనం ఒకటి వెలుగు చూసింది.
దేశంలో నానాటికి భార్యా బాధితులు పెరిగిపోతున్నారు. భార్యను కొట్టినా, తిట్టినా, ఏ రకంగానైనా హింసించినా చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాలను ఆసరా చేసుకుని కొంత మంది భార్యలు భర్తలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
జ్యోతి మౌర్య.. ఆమె వ్యక్తిగత విషయం హాట్ టాపిక్. భార్యపై ప్రేమతో ఆమె కోరిందల్లా తెచ్చాడు భర్త. చివరకు తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందనగానే..అందుకు ప్రిపరేషన్ ఇప్పించాడు. చివరకు తన కృషితో గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయ్యింది.