దేశంలో నానాటికి భార్యా బాధితులు పెరిగిపోతున్నారు. భార్యను కొట్టినా, తిట్టినా, ఏ రకంగానైనా హింసించినా చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాలను ఆసరా చేసుకుని కొంత మంది భార్యలు భర్తలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
దేశంలో నానాటికి భార్యా బాధితులు పెరిగిపోతున్నారు. భార్యను కొట్టినా, తిట్టినా, ఏ రకంగానైనా హింసించినా చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాలను ఆసరా చేసుకుని కొంత మంది భార్యలు భర్తలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. బయటకు చెప్పుకోలేక లోలోన మదనపడుతున్న భర్తలు ఎంతో మంది ఉన్నారు. భార్యను ఏమైనా అందామంటే విడాకులంటుందని, పిల్లల్ని దూరం చేసుకోలేక కాంప్రమైజ్ అయ్యి బతికేస్తున్నారు పతులు. భార్య కోరిక మేరకు అడిగినవన్నీ భర్త చేసి పెడుతున్నా.. ఆశలు మాత్రం తీరడం లేదని కొంత మంది మహిళలకు. ఇంకా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ అది చేయడం లేదూ.. ఇది చేయడం లేదంటూ పోరు పెడుతూనే ఉంటారు. ఇక భార్య ఇష్టాన్ని గౌరవించి, చదివించి ఉన్నత స్థానాలకు తీసుకెళుతున్న భర్తలకు కూడా చుక్కులు చూపిస్తున్నారు కొంత మంది భార్యామణులు.
ఉత్తరప్రదేశ్‌లోని అలోక్ మౌర్య-జ్యోతి కథ ఇలాంటిదే. ప్రభుత్వ ఉద్యోగం చేయడం తన కల అని చెప్పిన భార్యకు ప్రిపరేషన్ ఇప్పించడంతో.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా ఎన్నికయ్యింది జ్యోతి. ఆ తర్వాత వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టి హింసించిదంటూ అలోక్ మౌర్య ఇటీవల వాపోయిన సంగతి విదితమే. ఇందులో నిజ నిజాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఆ తరహా ఘటనే మరోటి చోటుచేసుకుంది. ఇది కూడా యుపిలో జరగడం యాదృచ్ఛికం. వివరాల్లోకి వెళితే.. కాన్పూరుకు చెందిన అర్జున్ సింగ్, సవిత మౌర్య భార్యా భర్తలు. వీరికి 2017లో వివాహం జరిగింది. భార్య కష్టాన్ని, చదువు పట్ల ఆమెకున్న ఇష్టాన్ని గుర్తించిన భర్త.. భార్యను నర్సింగ్ చదివించాడు. దాని కోసం అప్పులు కూడా చేశాడు.
చదువు పూర్తయ్యాక ఆమెకు మెడికల్ లైన్‌లోనే ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. రెండు మూడు నెలలు ఉద్యోగం చేసే సరికి సవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి భర్తను దూరం పెట్టడం మొదలు పెట్టింది. వేరో గదిలో పడుకోవడం మొదలు పెట్టే సరికి భర్త నిలదీయడంతో.. నల్లగా, పొట్టిగా ఉన్నావని, నీలాంటి వ్యక్తితో కాపురం చేయలేని అనే సరికి అర్జున్ ఒక్కసారిగా ఖిన్నుడయ్యాడు. భర్త నుండి విడాకులు కావాలంటూ ఆమె దరఖాస్తు చేసింది. అయితే తనకు భార్య కావాలంటూ అర్జున్ పోరాడుతున్నారు. ఆమె చదువు కోసం రూ.6 నుండి 7 లక్షలు ఖర్చు పెట్టానని, కూలీ పనులు చేస్తూ రుణాన్ని తీరుస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం జరగాలంటూ వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.