ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో పెద్ద అల్లర్లు, హింసాకాండలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే సమయంలో వారికి రాజకీయంగా కొంతమంది మద్దతు ఇస్తుంటారు.. ఆ సమయాల్లోనే యూనివర్సిటీల్లో గొడవలు, హింసాత్మాక ఘటనలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. విద్యాసంస్థల్లో సైతం ఇలాంటి గొడవలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు.. విద్యా సంస్థల్లో గొడవలు, హింసాత్మక ఘటనలు చెలరేగడంతో విద్యార్థులు చదువుపై ఎఫెక్ట్ పడుతుందని జేఎన్ యూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.. ఎందుకు తీసుకున్నారన్న విషయానికి వస్తే..
గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న విద్యార్థులకు రాజకీయ నేతలు కొంతమంది తోడు కావడంతో ధర్నాలు, అల్లర్లే కాదు కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘటనలు కూడా చెలరేగుతున్నాయి. దీంతో విద్యాప్రమాణాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని భావించిన జేఎన్యూ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇక నుంచి అకారణంగా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎవరైనా ధర్నాలు, గొడవలు చేస్తే రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫైన్ విధించాలని.. హింసాత్మక చర్యలకు పాల్పపడితే పూర్తిగా అడ్మిషన్ రద్దు చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పది పేజీలలతో కూడాని సర్క్యులర్ ని పాస్ చేసిన జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ శాంతి శ్రీ డి పండిట్ ఈ నిబంధనలు ఫిబ్రవరి 3 నుంచి కఠినంగా అమలు అవుతాయని అన్నారు. ఎంతటి వారైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల బీబీసీ మోడీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన తర్వాత పలు యూనివర్సిటల్లో పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని.. కొన్ని యూనివర్సిటీల్లో అల్లర్లు, గొడవలు జరుగుతున్నాయని.. అలాంటివి ఇక ముందు ఎక్కడా జరగకుండా ఉండేందుకు, విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇచ్చే క్రమంలో ఈ నిబంధనలను తీసుకొచ్చామని అన్నారు.
ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ లో పెద్ద ఎత్తున గొడవలు చెలరేగిన విషయం తెలిసిందే. విద్యా, రాజకీయ కారణాలతో కొంతమంది యూనివర్సిటీల్లో కావాలని విద్యార్థులను రెచ్చగొట్టడం.. అల్లర్లకు పాల్పపడటం జరుగుతుందని కాలేజ్ యాజమాన్యం అభిప్రాయ పడుతుంది. ఈ క్రమంలోనే జేఎన్ యూ కీలక నిర్ణయం తీసుకొని కొత్త రూల్స్ అమల్లోకి తీసుకు వచ్చింది. ఈ నిబంధనలు పార్ట్ టైమ్ స్టూడెంట్స్ తో పాటు అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. జేఎన్ యూ ప్రాంగణంలో ఎలాంటి జూదం ఆడినా, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించినా, ఇష్టం వచ్చినట్లు మద్యం సేవించినా, అసభ్య పదజాలం ఉపయోగించినా, ఫోర్జరీ చేయడం లాంటి 17 నేరాలకు విధించే శిక్షలను ఈ నిబంధనలో చేర్చారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కాపీలు స్టూడెంట్స్ పేరెంట్స్ కి కూడా పంపించబడతాయని జేఎన్ యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్కొంది.
JNU issues new disciplinary rules. Students can be imposed a penalty of Rs 20,000 for holding dharnas, face admission cancellation or a fine of up to Rs 30,000 for resorting to violence at JNU. #JNU @JNU_official_50
I report for @PTI_News https://t.co/LTcU1Z4uLy
— Vishu Adhana (@vishuadhana08) March 2, 2023