ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో పెద్ద అల్లర్లు, హింసాకాండలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే సమయంలో వారికి రాజకీయంగా కొంతమంది మద్దతు ఇస్తుంటారు.. ఆ సమయాల్లోనే యూనివర్సిటీల్లో గొడవలు, హింసాత్మాక ఘటనలు జరుగుతున్నాయి.
Jawaharlal Nehru University: ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటిలో మాంసాహారం విద్యార్థుల మధ్య గొడవకు దారి తీసింది. శ్రీరామ నవమి పండుగ రోజు మాంసాహారం వండటం, దాన్ని తినొద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీపీపీ) విద్యార్ధులు అడ్డుకోవటం గొడవ దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ గొడవల్లో రెండు వర్గాల విద్యార్థుల్లో 16 మంది గాయపడ్డారు. జేఎన్‌యూఎస్‌యూ తెలిపిన దాని ప్రకారం.. శ్రీరామ నవమి పండుగ రోజు వండిన మాంసాహారాన్ని తినొద్దని ఏబీవీపీ విద్యార్థులు మిగిలిన విద్యార్థుల్ని […]