Jawaharlal Nehru University: ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటిలో మాంసాహారం విద్యార్థుల మధ్య గొడవకు దారి తీసింది. శ్రీరామ నవమి పండుగ రోజు మాంసాహారం వండటం, దాన్ని తినొద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీపీపీ) విద్యార్ధులు అడ్డుకోవటం గొడవ దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ గొడవల్లో రెండు వర్గాల విద్యార్థుల్లో 16 మంది గాయపడ్డారు. జేఎన్‌యూఎస్‌యూ తెలిపిన దాని ప్రకారం.. శ్రీరామ నవమి పండుగ రోజు వండిన మాంసాహారాన్ని తినొద్దని ఏబీవీపీ విద్యార్థులు మిగిలిన విద్యార్థుల్ని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా హాస్టల్‌లో భీకర వాతావరణాన్ని సృష్టించారు. అయితే ఏబీవీపీ విద్యార్థులు ఈ ఆరోపణల్ని ఖండించారు. పండుగ రోజు హాస్టల్‌లో దేవుడి పూజ చేస్తుండగా జేఎన్‌యూఎస్‌యూ వర్గానికి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు.
దీంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటమే కాకుండా రాళ్లు సైతం విసురుకున్నారు. ఒకరినొకరు గాయపర్చుకున్నారు. గొడవ అనంతరం క్యాంపస్‌లోనే వేరువేరుగా కవాతు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు.. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.