జీవితం అంటే పూల బాట కాదు. కష్టాలు, కన్నీళ్లు, సంతోషం అన్నింటి కలబోతే జీవితం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి. నా తలరాత ఇంతే అని నిరాశపడిపోకుడదు. విధిని ఎదిరించి నిలవాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు జలంధర్‌కి చెందిన నేహా శర్మ.
వృత్తి రీత్యా లాయర్ అయిన నేహా శర్మ.. ప్రస్తుతం రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతున్నారు. ఇక ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిసి.. ప్రతి ఒక్కరి హృదయం ఆవేదనతో చలించిపోతుంది. ఫుడ్ బ్లాగర్… గౌరవ్ వాసన్… ఓసారి నేహా శర్మ స్టాల్ దగ్గర పరాటా తింటూ… ఆమె కథ తెలుసుకున్నాడు. ఎంతో ప్రేరణ పొందాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో నేహా శర్మ వీడియో పోస్ట్ చేసి ఆమె కథను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: బృందావనంలో వితంతువుల రంగుల పండుగ..
జలంధర్‌కు చెందని నేహాశర్మ.. ఎల్ఎల్బీ చదివింది. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టేలోపే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. నేహా శర్మ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. అప్పటి వరకు సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని కుదుపు. భర్త నేహా శర్మను వదిలేసి వెళ్లాడు. చేతిలో బిడ్డతో.. తల్లిదండ్రుల చెంతకు వెళ్లింది. ఇక చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలకు అంతులేకుండా పోయింది. ఈ సంఘటనలన్ని నేహా శర్మను తీవ్రంగా కలిచివేసాయి.
ఇది కూడా చదరవండి: అభిమానంతో సుకుమార రూపం
అయితే అందరిలా డీలా పడిపోయి.. ఏడవలేదు. తనను వెక్కిరించిన వారి ముందే.. గర్వంగా తలెత్తుకుని నిలబడాలరి.. కుమార్తెకి మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది. తన దగ్గర ఉన్న చిన్న మొత్తంతో రోడ్డు పక్కన నేహా శర్మ పరాటా జంక్షన్ అనే చిన్న స్టాల్ ప్రారంభించింది. పంజాబ్‌లోనే అతిపెద్ద పరాటాను తాను అమ్ముతున్నట్లు ఆమె తెలిపింది. పరాటా ఒక్కోటీ రూ.50కి అమ్ముతోంది. పరాటాలతోపాటూ… టీ, కాఫీ కూడా చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఆ దృశ్యం హృదయవిదారకం.. తల్లి కాళ్ల దగ్గర పాప ఆర్తనాదాలు..
నేహా శర్మ కుమార్తెకి ఇప్పుడు 15 సంవత్సరాలు. ఆమె ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోంది. కుమార్తె కల నెరవేర్చడమే తన లక్ష్యం అంటున్న నేహా శర్మ.. అందుకోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తానని తెలిపింది. అంతేకాక మహిళలు జీవితంలో ఎన్నడు వెనకడుగు వేయొద్దని.. ధైర్యంగా ముందుకు సాగిపోవాలని తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజనులు నేహా శర్మ పట్టుదలని, దీక్షని ప్రశంసిస్తున్నారు. మీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. నేహా శర్మ పట్టుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.