సాధారణంగా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు.. జీతం కోసమే పనిచేస్తారు. పరిస్థితి ఎలా ఉన్నా.. తాము ఏం చేశామో.. చేయలేదో.. అని చూడకుండా.. సమయానికి జీతం పడితే చాలని అనుకుంటారు. ఇది కలెక్టర్ నుంచి బిల్లు కలెక్టర్ వరకు అందరూ అనుకునే మాట.. పాటించే సూత్రం. పని చేశామా.. లేదా.. అనే దానితో సంబంధం లేకుండా.. జీతం తీసుకునేవారే! అయితే.. ఓ జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం! పనిచేయకుండా.. జీతం ఎలా తీసుకుంటాం! అని భావించాడు. అందుకే.. ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయా.. నాకు అందాల్సిన ఈ నెల జీతాన్ని నిలిపేయండి అంటూ అధికారులకు సమాచారం పంపించారు.
MP | After y’day’s review meeting it was revealed that there is a delay in disposing of a large number of pending complaints of citizens. An order was issued to withhold my own salary along with a few other officers for the month of Dec: Jabalpur Collector Karmveer Sharma pic.twitter.com/rauizeTypH
— ANI (@ANI) December 28, 2021
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ పనిచేస్తున్నారు. నెలలు గడిచినా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయినందుకు తనకు డిసెంబర్ నెలకు వచ్చే జీతాన్ని నిలిపివేయాలని అధికారులను కోరాడు. 100 రోజులు దాటినా సీఎం హెల్ప్ లైన్ కు అందిన ఫిర్యాదులు ఇంకా అలానే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారుల వేతనాలను కూడా ఆపాలని జిల్లా కోశాధికారికి సూచించారు. కలెక్టర్ కరంవీర్ శర్మ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ కేసులు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు తహసీల్దార్ల ఇంక్రిమెంట్లు ఆపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు.. జీతం వద్దన్న ఈ కలెక్టర్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సూపర్ కలెక్టర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
However, there is an improvement in the work. I’ll review the process after 7 days and will make a decision according to it: Jabalpur Collector Karmveer Sharma
— ANI (@ANI) December 28, 2021