విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.915 కే ఫ్లైట్ టికెట్‌ను ఆఫర్ చేసింది. ఈ వార్తతో విమాన ప్రయాణికులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..ఇండిగో సంస్థ 15వ వార్షికోత్సవం సందర్భంగా విమాన ప్రయాణికులకు గొప్ప శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి26 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఈ ఆఫర్‌ను వర్తింపజేయనున్నారు.
ఇక ఆగస్టు 4 నుంచి 6 మధ్య బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో సంస్థ తెలిపింది. ఇక దీంతో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు రూ.2115 ఆఫర్ వర్తించనుంది. ఇక తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు అంతా సిద్దంగా ఉన్నామంటూ విమాన ప్రయాణికులు తెలుపుతున్నారు.