ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల కొన్ని, కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులు పట్టాలు తొలగించడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. సాంకేతిక లోపాల వల్ల కొన్ని.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ఇలా కారణాలు ఏవైనా రైలు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అప్పుడప్పుడు రైళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్తున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా రాంపూరం గ్రామం వద్ద రైలులో అకస్మాత్తుగా ఒక బోగీ నుంచి పొగలు రావడంతో వెంటనే రైలు ని నిలిపి వేశారు. ఉన్నట్టుంది బోగీ నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురయ్యారు.. భయంతో వెంటనే ట్రైన్ దిగి పరుగులు తీశారు.
తప్పని సరి పరిస్థితిలో ప్రయాణికులు రైల్వే ట్రాక్ వెంట సమీప గార్ల రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్లారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బ్యాటరీ లో వచ్చిన సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతులు చేశారు. దీంతో దాదాపు ట్రైన్ 45 నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరింది. ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదాలు జరగలేదని అధికారలు తెలిపారు.