ఈ మద్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్లు అతిగా ప్రవర్తిస్తు ఎదుటివారిపై దాడులు చేయడం.. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి.
ఇటీవల భూమిపైనే కాదు.. ఆకాశంలో కూడా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానాలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు వచ్చి ఢీ కొట్టడం లాంటివి జరుగుతున్నాయి. పైలెట్ సమయస్ఫూర్తితో సురక్షితంగా ల్యాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మద్య కొంతమంది విమానంలో ప్రయాణికులు అతిగా ప్రవర్తించి డోర్లు ఓపెన్ చేయడం, ఎదుటివారిపై దాడులకు దిగడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ ప్రయాణికుడు చేసిన పనికి ప్యాసింజర్లు గజ గజ వణికిపోయారు. ఈ ఘటన ఏషియానా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దక్షిణ కొరియా ఏషియానా ఎయిర్ లైన్స్ కి చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఓ ప్యాసించ్ డోర్ తెరిచాడు.. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 194 ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. ఏ 321 విమానం సుమారు 650 అడుగుల ఎత్తులో ఉండగా ఓ ప్యాసింజర్ డోర్ తీశాడు. దక్షిణ దీవీ జేజూ నుంచి డేగూ కి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ డోర్ కొద్దిగా తెరుచుకుంది. ఇది గమనించిన పైలెట్ వెంటనే విమానాన్ని డేగు విమానాశ్రయంలో ఎమర్జేన్సీ ల్యాండ్ చేశారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు.
విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు ఎమర్జేన్సీ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడన్న విషయం తెలియరాలేదు. ఉల్సన్ లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పాల్గొనేందుకు పలువురు అథెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. డోర్ తెరిచిన కారణంగా కొంతమందికి శ్వాస కోస ఇబ్బందులు తలెత్తగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు రవాణా శాఖ తెలిపింది. విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo.
El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero.
El avión… pic.twitter.com/G0rlxPNQuW— On The Wings of Aviation (@OnAviation) May 26, 2023