SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Indian Woman With Mustache Photos Goes Viral

మీసం లేకపోతే బతకలేనంటున్న మహిళ! ఎవరు ఈమె?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 23 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మీసం లేకపోతే బతకలేనంటున్న మహిళ! ఎవరు ఈమె?

కొంతమంది మహిళలకు మగవారిలానే మూతి మీద, గడ్డం మీద, చెంపల పైన వెంట్రుకలు మొలుస్తాయి. ఆ వెంట్రుకలు కనబడకుండా ఉండేందుకు థ్రెడింగ్ ట్రీట్మెంట్ అని, హెయిర్ రిమూవల్ క్రీములని ఏవేవో అప్లై చేసి అందంగా కనబడాలని అనుకుంటారు. మగవారిలా ముఖం మీద వెంట్రుకలు కనబడితే సమాజంలో తలెత్తుకోలేమని ఫీలవుతూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం మీసాలతోనే తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఆ మీసమేంటి అసహ్యంగా అని తిట్టినా, ఎగతాళి చేసినా డోంట్ కేర్ అని అంటోంది.  కేరళలోని కణ్ణూర్ జిల్లాకు చెందిన షిజకు.. అయిదేళ్ల వయసు నుండే మూతి మీద మీసం మొలవడం ప్రారంభించింది. సాధారణంగా ఆ వయసులో అబ్బాయిలకే మీసాలు మొలవవు. అలాంటిది ఈమెకు మీసం మొలిచింది. అలా అని ఆమె అందరిలా వెంట్రుకలు తొలగించుకోవాలని ఏనాడూ అనుకోలేదు. మీసాన్ని అలానే ఉంచుకోవాలని అనుకుంది. మీసం వల్ల తానెప్పుడూ అందంగా లేనని అనుకోలేదట. చాలామంది ఆ మీసాన్ని తీసేసుకోమని సలహాలిచ్చారట. కానీ, షిజ మాత్రం వారి మాటలను లెక్కచేయదట. ఈ మీసంతోనే ఆమె దర్జాగా బయటకు వెళ్తానని, రాత్రి కూడా భయం లేకుండా దుకాణాలకు వెళ్తానని ఆమె వెల్లడించింది.

ముఖంపై వెంట్రుకలు మహిళల అందాన్ని చెడగొడతాయని, వాటిని తొలగించుకోవాలన్నది చాలా మంది మహిళలు అభిప్రాయపడుతుంటారు. వెంట్రుకలు మొలిస్తే, ఏదో ప్రాణం పోయినట్టు ఫీలవుతారని అనుకుంటారు. వీళ్ళ బలహీనతను క్యాష్ చేసుకుని కొన్ని కంపెనీలు రకరకాల ఉత్పత్తులను మార్కెట్లో దించుతున్నాయి. హెయిర్ రిమూవల్ క్రీములు, రేజర్లు, ఎపిలేటర్స్, వాక్స్ స్ట్రిప్స్ లాంటి ఎన్నో సాధనాలు మార్కెట్లో వచ్చాయి. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పెద్దగా వీటి గురించి పట్టించుకోవడం లేదు. తమ ముఖం మీద వెంట్రుకలు ఉంటే ఏమైంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. షిజలా మీసం పెంచుకునేందుకు గర్వపడుతున్నారు.

ఇక మీసం లేకుండా తనను తాను ఊహించుకోవడం కష్టమని షిజ అంటోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి కొందరు ప్రశంసించగా, మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే, పొగిడినా, తిట్టినా తనేం పట్టించుకోనని ఆమె చెబుతోంది.  మీసాలు ఉంచుకోవాలా? తీసేయాలా? అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆమె వెల్లడించింది. తన భర్త, కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తన మీసం పట్ల అభ్యంతరం వ్యక్తపరచడం లేదని, అలాంటప్పుడు సమాజం గురించి ఎందుకాలోచిస్తానని ఆమె అంటోంది. కాగా 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త ‘హర్నామ్ కౌర్’ అనే సిక్కు మహిళ.. నిండుగా గడ్డం పెంచిన అతి చిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. తనను తాను ప్రేమించుకోవడం, నేర్చుకోవడానికి ముఖ వెంట్రుకలను అంగీకరించడం ఎంతో ముఖ్యమని హర్నామ్ కౌర్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇలా కొంతమంది మహిళలు ఇప్పుడు మీసాలు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు.  ముఖం మీద వెంట్రుకలు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. 

షిజ ఇంత ఆత్మవిశ్వాసంతో ఉండడానికి కారణం తాను ఎదుర్కున్న సమస్యలే. ఆమెకు ఆరు సర్జరీలు జరిగాయి. వక్షోజాల్లో గడ్డ, అండాశయంలో తిత్తి తొలగించేందుకు సర్జరీలు చేయాల్సి వచ్చింది. అయిదేళ్ల క్రితం ఆమెకు గర్భాశాయం తొలగించారు. అదే ఆమె చేయించుకున్న చివరి సర్జరీ. ఈ సర్జరీతో ఆమె.. ఇక లైఫ్ లో ఆపరేషన్ గదిలోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకుంది. ఇక కేరళ ఎంత అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్నా ఇంకా అక్కడ పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోందని ఆమె అంటోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ఒంటరిగా జీవించడం అక్కడ వ్యవస్థ ఒప్పుకోదని ఆమె వెల్లడించింది. షిజకు పెళ్లయి, భర్తతో తమిళనాడు  వెళ్లిన తర్వాత గానీ ఆమెకు స్వేచ్ఛ రాలేదని ఆమె అన్నది. దుకాణానికి నడిచి వెళ్లి కావలసిన సరుకులు స్వయంగా తానే తెచ్చుకుంటానని, రాత్రయినా ఒక్కదాన్నే దుకాణానికి వెళ్లినా ఇక్కడ ఎవరూ పట్టించుకోరని ఆమె అంటోంది. సొంతంగా తన పనులు చేసుకోవడం తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని షిజ చెప్తోంది. తాను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, అయితే బతికినంత కాలం నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగష్టులో 13 రోజులు బ్యాంకులు క్లోజ్! ఏయే రోజు అంటే..

ఇది కూడా చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!

Tags :

  • Harnaam Kaur
  • Kannur District
  • kerala
  • latest national news
  • Mustache Woman
  • Shija
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

  • బ్రేకింగ్: మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ లీడర్ కన్నుమూత..

    బ్రేకింగ్: మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ లీడర్ కన్నుమూత..

  • మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో అంబులెన్స్ బోల్తా.. బాధితులను పట్టించుకోకుండా జంప్..

    మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో అంబులెన్స్ బోల్తా.. బాధితులను పట్టించుకోకుండా జంప్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam