ఇటీవల పలు సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ఆఫీస్ లో ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, ఇంటర్ నేషనల్ ట్యాక్సెషన్ లో అవకతవకలు ఉన్న నేపథ్యంలో ఐటీ శాఖ వారు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో ఉన్న బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) కార్యాలయంలో మంగళవారం ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీసీ కార్యాలంలో ఉన్న ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు మొబైల్స్ సీజ్ చేసినట్టు సమాచారం. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, ఇంటర్ నేషనల్ ట్యాక్సెషన్ లో పలు అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఐటీ సోదాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాము కేవలం అకౌంట్స్ బుక్స్ ని చెక్ చేస్తున్నామని.. సోదాలు నిర్వహించడం లేదని ఐటీ శాఖ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో బీబీసీ కార్యాలపై ఐటీ రైడ్స్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసింది.. అది పలు వివాదాలకు దారి తీసింది. ఈ వీడియో పై తమ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని అధికార పార్టీ నేతలు పలు ఆరోపణలు చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు దుమారం రేపడంతో యూట్యూబ్, ట్విట్టర్ లో దీనికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసింది కేంద్రం. మరోవైపు ప్రధాని మోదీని అప్రతిష్టపాలు చేసేలా ఈ డాక్యుమెంటరీ రూపొందించారని బీబీసీని భారత్ లో నిషేదించాలని హిందూ సేన దాఖలు చేసిన పిటీషన్ ని సుప్రీం కోర్టు కొట్టిపడేసింది.
ఇదిలా ఉంటే ఐటీ దాడులు కొనసాగుతాయి అన్న కొన్ని గంటలకు ముందే కేంద్ర హూంశాఖా మంత్రి అమిత్ షా 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్రంగా విమర్శించారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రధాని మోదీ తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నారని.. 2002 తర్వాత కూడా ఆయనే గొప్ప నేతగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నారు అని అమిత్ షా అన్నారు. కాగా, ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ కార్యాలయంలో కూడా ఐటీ శాఖధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి ఎలాంటి సోదాలు జరగలేదని, ఇది కేవలం సర్వేగానే సంబోదిస్తున్నారు ఐటీశాఖ వర్గాలు. ఇక ఢిల్లీ బీబీసీ ఆఫీస్ లో ఐటీ సోదలు చేస్తున్నారంటూ మహువా మెయిత్రా ట్విట్ చేశారు.
Reports of Income Tax raid at BBC’s Delhi office
Wow, really? How unexpected.
Meanwhile farsaan seva for Adani when he drops in for a chat with Chairman @SEBI_India office.
— Mahua Moitra (@MahuaMoitra) February 14, 2023