SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Iitian Quits Mnc Rat Race To Teach Quality Math Via Online Classes

విద్యార్థుల కోసం MNC ఉద్యోగాన్ని వదులుకున్న టీచర్! గ్రేట్ సార్!

విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో.. ఏ పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా కోచింగ్ సెంటర్లను చూడాల్సిన పరిస్థితి. దీనికి వేలకు వేలు పోయాల్సిందే. అయినప్పటికీ పోటీ పరీక్షల్లో నెగ్గుతామా అంటే సందేహామే. ఇక ఐఐటి కోచింగ్ సెంటర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇవి చెట్టుకొకటి ఉంటాయి. ధనార్జనే ధ్యేయంగా బతికేస్తున్న ఈ సంస్థలు సరైన కోచింగ్ ను అందించవు. దీంతో ఐఐటిలో చేరాలన్న వారి కలలు కల్లలు కావాల్సిందే. అటువంటి వారికోసమో తానున్నానని ముందుకు వచ్చారు మరో ఆనంద్ కుమార్.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 23 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విద్యార్థుల కోసం MNC ఉద్యోగాన్ని వదులుకున్న టీచర్! గ్రేట్ సార్!

జీవితంలో త్వరగా సెటిల్ కావాలంటే వ్యాపారమైనా చేయాలి, లేదా బాగా చదువుకోవాలి. ఇవే మన ముందున్న ఆప్షన్లు. వ్యాపారం తండ్రుల వారసత్వంగా అయినా రావచ్చు కానీ చదువు స్వయం కృషితో సంపాదించుకోవాలి. ఉన్నత చదువులు చదవాలంటే దేశంలో ముందుగా చెప్పుకున్న విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి). ఇందులో సీటు రావాలంటే ముందుగా జెఇఇ పాస్ కావాలి. దీని కోసం ఎంతో కష్టపడాలి. సరదాలు, స్నేహితులు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే ఇందులో సీటు సాధ్యం. అంతేకాకుండా దీనికి సంబంధించిన శిక్షణ కూడా వేలల్లో కూడుకున్నది. కేవలం ధనవంతులు మాత్రమే ఈ ఫీజులను భరించగలరు. ఇక మంచి స్కోర్ వచ్చి ఐఐటిల్లో సీటు సంపాదిస్తే చాలు మల్టీ నేషనల్ కంపెనీలు సైతం క్యూలు కడతాయి. ఇక డబ్బు సంపాదనలో బ్రతికేస్తుంటారు. కానీ తాను అందరిలా కాదని నిరూపించారో వ్యక్తి. ఐఐటిలో ప్రవేశాల నిమిత్తం తీసుకునే శిక్షణ కోసం విద్యార్థులు భారీగా ఖర్చు పెడుతున్న ధోరణి నచ్చని ఓ వ్యక్తి.. విలువైన విద్యను అందించాలని సంకల్పించుకున్నారు. ఎంఎన్‌సి ఉద్యోగాన్ని వీడి గురువు అవతారమెత్తారు. మరో ఆనంద్ కుమార్ అయ్యాడు.

కోచింగ్ సెంటర్లకు వేలు వేలు ఖర్చు పెట్టినా, సబ్జెక్ట్ పై అవగాహన రాక ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థుల కోసం బోధించేందుకు సిద్ధమయ్యారు శ్రవణ్.  శ్రవణ్ గణితంలో దిట్ట. జెఇఇ అర్హత సాధించి, ఐఐటి గువాహటిలో విద్యనభ్యసించారు. అయితే ఐఐటిలో చేరేందుకు కోచింగ్ సెంటర్లు వసూలు చేస్తున్న డబ్బుల గురించి తెలిసి.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆన్ లైన్ లో గణిత సబ్జెక్ట్ ను నేర్పించేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్‌లో ‘మ్యాథ్స్ విత్ శ్రవణ్’ అనే చానల్ ద్వారా తన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మంచి విద్యను ఇవ్వాలన్న సదుద్దేశంతో చివరకు ఎంఎన్‌సిలో తన ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. యూట్యూబ్, ఆన్ లైన్ వీడియోల వల్ల విద్యార్థులు సైతం చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ శ్రవణ్ స్కూల్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ద్వారా బయటకు వచ్చాయి. తన స్నేహితుడు చేపడుతున్న ఈ కృషిని రాజ్ అభినందించాడు. తన స్నేహితుడు శ్రవణ్ గణితం బోధిస్తున్న వీడియో స్క్రీన్‌షాట్‌ను రాహుల్ రాజ్ షేర్ చేశారు.

 శ్రవణ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి కోట్లు సంపాదించొచ్చు కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదని రాజ్ చెప్పారు. ‘స్కూల్ ఫ్రెండ్ శ్రవణ్ గణితంలో మేధావి. ఆయన జెఇఇ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటి గువాహటిలో విద్యనభ్యసించారు. అనంతరం ఎంఎన్‌సి ఉద్యోగాన్ని విడిచిపెట్టి, మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఆపేసి.. విద్యార్థుల కోసం గణితాన్ని బోధించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాడు. కోచింగ్ సెంటర్లు అందించలేని గణిత జ్ఞానాన్ని విద్యార్థులకు పంచేందుకు శ్రవణ్‌లోని ఋషి, యాత్రికుడు.. విచ్చలవిడి పిచ్చివాడిలా జీవిస్తున్నాడు’ అని రాహుల్ రాజ్ ట్వీట్ చేశారు. భారీగా డబ్బులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లతో కూడా సాధ్యం కాని పనిని శ్రవణ్ చేసి చూపిస్తున్నారు. ఉచితంగా బోధిస్తూ.. వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ భవిష్యత్తు ఇంజనీర్లను తయారు చేస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా బతికే కోచింగ్ సెంటర్ల కన్నా విలువైన విద్యను అందిస్తున్నారు. కోచింగ్ పేరుతో సొమ్ముచేసుకోవాలని చూసే గురువులు, కోచింగ్ సెంటర్లను కాదని ఉచితంగా సేవలందింస్తున్న శ్రవణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

School friend Shrawan is a maths genius. He qualified JEE & joined IIT Guwahati. He quit the race MNC jobs and kept finding ways to study and teach maths. He lives like sages, like travelers, like nomads, like crazy pple. All to teach good maths which coaching classes have killed pic.twitter.com/kXitMlDO9v

— Rahul Raj (@bhak_sala) February 12, 2023

Tags :

  • IIT
  • Indian Institute of Technology Guwahati
  • Inspirational Story
  • Maths Techniques
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam