దేశంలో ఎంతో మంది తమ అద్భతమైన మేథస్సుతో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది వెలుగులోకి వస్తున్నారు.. మరికొంత మంది తమకు ఎంత టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోని ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతున్నాం. ఎన్నో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరిచే విధంగా, కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఔత్సాహికులు తామ టాలెంట్ తో ఒక్కరోజులోనే స్టార్స్ అవుతున్నారు. దేశంలో యువత ఎన్నో అద్భుతమైన అవిష్కరణలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ యువకుడు చేసిన అద్భుత సృష్టి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ యువకుడు చేసిన అద్భుతం ఏంటో చూద్దాం..
భారత దేశంలో యువత ప్రతిభా పాటవాలకు, కొత్త కొత్త ఆవిష్కరణలకు కొదవ లేదని ఎంతో మంది నిరూపించారు. కాకపోతే కొంతమంది నూతన ఆవిష్కరణలకు ప్రాత్సాహం లేకపోవడంతో మరుగున పడుతున్నాయి. అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యువత ఆవిష్కరిస్తున్న కొత్త వస్తువులు, వాహనాలు కోట్ల మంది ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఓ యువకుడు చేసిన అద్భుతమైన వాహనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ బాధలు భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ బైకులపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ యువకుడు తయారు చేసిన వాహనం చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఆశ్చర్యపోయాడు.. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ఇది ఓ వినూత్నమైన సోలార్ పవర్డ్ వెహికిల్.. పొడవైన స్కూటర్. ఈ వాహనం నడిపే వ్యక్తి తో సహా మొత్తం ఏడుగురు కూర్చునే విధంగా ఉంటుంది. వాహనంపై ఒక రూఫ్ ని కూడా ఏర్పాటు చేశారు.. ఇది సోలార్ రూఫ్. సోలార్ ఫోటో వోల్టాయిక్ సేల్స్ ప్యానల్ ని పై కప్పుగా ఏర్పాటు చేశారు. ఈ రూఫ్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.. వాహనంలో కూర్చున్న వారికి నీడను ఇవ్వడమే కాదు దీనిపై ఎండపడిన తర్వాత బ్యాటరీలో శక్తి చేకూరుతుంది. ఈ శక్తితో వాహనం ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా హర్ష గోయాంకా ‘ఇది ఓ స్థిరమైన అద్భుతమైన ఆవిష్కరణ.. పాత స్క్రాప్ నుంచి తయారు చేసిన ఈ వాహనం ఏడుగురితో ప్రయాణిస్తుంది. ఇలాంటి అవిష్కరణలు దేశం గర్వపడేలా చేస్తుంటాయి’ అంటూ ట్విట్ చేశారు. గోయాంకా ట్విట్ పై నెటిజన్లు సైతం సానుకూలంగా స్పందిస్తూ.. దేశంలో ఇలాంటి మేథావులు ఎంతో మంది ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
So much sustainable innovation in one product – produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW
— Harsh Goenka (@hvgoenka) April 29, 2023