వజ్రాల వ్యాపారం అంటే.. కోటీశ్వరులై ఉంటారు. దేనికి లోటు ఉండదు.. కాలు కదిపే పని లేకుండా.. కోరుకున్నవన్ని.. కాళ్ల దగ్గరకే వచ్చే విలాసవంతమైన జీవితం. దేనికి లోటు ఉండదు. మరి ఇంత మంచి జీవితాన్ని వదులుకుని.. ఇహలోక బంధాలు, ప్రేమానురాగాలపై ఎలాంటి వ్యామోహం లేకుండా.. జీవించాలని కోరుకుంటారా. కానీ ఆ చిన్నారి 9వ ఏటనే అలాంటి నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అంత చిన్న వయసులోనే జీవితం గురించి పూర్తి అవగాహన వచ్చిందా.. లేక.. తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయమా తెలియదు. 9వ ఏటనే సన్యాస దీక్ష తీసుకుని.. సన్యాసినిగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఈ అరుదైన సంఘన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేష్, అమీ సంఘ్వీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం.. గత మూడు దశాబ్దాలుగా.. సూరత్‌లో వజ్రాలు పాలిష్, ఎగుమతి వ్యాపారం చేస్తూ.. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక ధనేష్ పెద్ద కుమార్తె దేవాన్షికి చిన్నప్పటి నుంచే దైవభక్తి మెండు. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆసక్తి. దీంతో తరచుగా తమ ఇంటి దగ్గర జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ఈ క్రమంలో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. దీని గురించి తల్లిదండ్రులకు తెలిపింది.
దేవాన్షి నిర్ణయాన్ని విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నతనంలోనే సన్యాసం తీసుకోవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దేవన్షి పట్టు వదలకుండా.. ప్రయత్నించి తల్లిదండ్రులను ఒప్పించింది. బిడ్డ గురించి తల్లిదండ్రులకు పూర్తిగా తెలుసు కనుక.. చివరకు దేవాన్షి నిర్ణయానికి అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జైన సన్యాసి ఆచార్య విజయ కీర్తియాశ్సూరి సమక్షంలో సన్యాస దీక్ష తీసకుంది. అయితే దేవాన్షి సన్యాస దీక్ష తీసుకోవడానికి ముందే.. ఇతర సన్యాసులతో కలిసి ఏకంగా 700 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని కుటుంబ సన్నిహిత వ్యక్తి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక దేవాన్షి ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. ఇదే కాక.. అనేక ఇతర నైపుణ్యాలు సైతం దేవాన్షికి ఉన్నట్లు బంధువులు తెలిపారు. మరి ఇంత చిన్న వయసులోనే సన్యాస దీక్ష తీసుకోవడం సరైన నిర్ణయమేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.