ఈ మద్య దేశవ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్లనో.. ఎవరైనా దుండగులు పట్టాలు తప్పించడం వల్లనో కమ్యూనికేషన్ ఇబ్బందుల వల్లనో మొత్తానికి ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంబవిస్తుంది. తాజాగా ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఏకంగా ప్లాట్ ఫాం పైకి దూసుకు వచ్చింది. దీంతో వ్యాగన్లు ఫ్లాట్ ఫామ్ పై చెల్లాచెదురుగ పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. వివరాల్లోకి వెళితే..
జాజ్ పూర్ జిల్లా కొరాయి స్టేషన్ వద్ద సోమవారం ఉదయం రైలు కోసం ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. అంతలోనే ఓ గూడ్స్ రైల్ పట్టాలు తప్పి అతి వేగంగా ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు రావడంతో ప్రమాదం జరిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ.. గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వచ్చి వెయిటింగ్ రూమ్ ని ఢీ కొట్టిందని అన్నారు. ఈ ఘటనలో స్టేషన్ భవనం బాగా దెబ్బతిన్నదని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామని.. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
ఈ ప్రమాదం కారణంగా ప్రస్తుతం పలు రైలు మార్గాలు నిలిచిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. ఒక్కసారే గూడ్స్ రైలు దూసుకు రావడంతో భయంతో ప్రయాణీకులు పరుగలు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 బోగీలు బోల్తాపడ్డాయని అధికారులు తెలిపారు. ఇంకా కొంత మంది బోగీల కింద ఉండటంతో రెస్క్యూ టీమ్ వారిని రక్షించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
#JustIn
Three passengers killed, while two others sustained grave injuries as a goods train derailed and rammed into passengers waiting at Korai station in #Odisha on Monday.@NewIndianXpress @Siba_TNIE pic.twitter.com/RtjYyhST2z— TNIE Odisha (@XpressOdisha) November 21, 2022