ఇటీవల మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ ఆడవారిపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు.
ఈ మద్య దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒకదశలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో నిర్భయ, దిశ లాంటి చట్టాలు అమలు చేస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కొంతమంది మృగాళ్లుగా మారి వారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఇక ప్రేమ పేరుతో అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి మోసగించి వారి అవసరం తీరిన తర్వాత దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ రైతు పొలంలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులపాలి గ్రామంలో గుర్తుతెలియని బాలిక మృతదేహాన్ని ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు మహిళలు వరి నారు నాటేందుకు వెళ్లారు. అయితే, వారు ఇంటికి తిరిగి వస్తుండగా కొన్ని గంటల క్రితం తవ్విన మట్టి కుప్పను గుర్తించారు. అనంతరం గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న హింజిలికట్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ వారికి ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. హింజిలికట్ పోలీసు ఐఐసి అభిమన్య దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహులపాలి గ్రామంలో స్మాశానంలో వద్ద యువతి శరీరాన్ని మట్టితో కప్పబడి ఉండటం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారని.. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని స్థానికుల సహకారంతో అస్కా మెజిస్ట్రేట్ సమక్షంలో యువతి మృతదేహాన్ని బయటికి తీశామని అన్నారు.
యువతి మెడలో బంగారు గొలుసు, హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫోటోని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు యువతిని హత్య చేసి అనంతరం ఇక్కడకి తీసుకువచ్చి మట్టిలో పూడ్చి పెట్టి ఉండవొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి మృతదేహాన్ని బరంపురం ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి పోర్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ యువతి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె మరణం వెనుక ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.