ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన నగరాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునికి సౌకర్యాలతో అతి వేగంగా దూసుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు ఏపీలో పరుగులు పెట్టబోతుంది. అతి వేగంగా ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ పట్టం నంచి విజయవాడ వరకు డిసెంబర్ లో ప్రారంభించే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సర్వీస్ ప్రారంభం అయితే ప్రయాణీకులకు రెండు గంటల సమయం కలిసి వస్తుందని అంటున్నారు.
ఇక వందే భారత్ రైలు వేగాన్ని ఇప్పుడు ఉన్న ట్రాక్ సామర్థ్యం ఎంతవరకు సరిపోతుందని అంచనావేస్తున్నారు.. ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ లో విశాఖలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు రైల్వే అధికారు. సాధారణంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు గంటకు 160 కీ.మీ వేగంతో వెళ్తుంది.. ఈ లెక్కన విశాఖ నుంచి విజయవాడకు వెళ్లే రైలు ప్రయాణానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. ఒకవేళ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రంగంలోకి దిగితే.. కేవలం నాలుగు గంటల్లోనే విశాఖ నుంచి విజయవాడ చేరుకోవొచ్చు. అంటే రెండు గంటల సమయం కలిసివస్తుంది.
ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో ప్రత్యేకతలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న రైళ్ల కంటే అత్యధిక వేగంగా ప్రయాణిస్తుంది వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఒకవేళ పొరపాటున రైళ్ళు ఒకే ట్రాక్ పై వస్తే.. ఒక కిలోమీటర్ దూరం ఉన్నపుడే అలర్ట్ సిగ్నల్ వస్తుంది… దీంతో వెంటనే రైలు వేగాన్నినియత్రించవొచ్చు. విద్యుత్ సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రతి కోచ్ కీ నాలుగు ఎమర్జెన్సీ డోర్స్ తో పాటు ఏసీ సౌకర్యం కూడా ఉంది.
అంతేకాదు ఈ రైల్ లో బయో వ్యాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్స్, అంధులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ లిపిలో సమాచారం ఉంటుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో 475 వందే భారత్ రైళ్ల ను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు 2006 వరకు దేశంలో బుల్లెట్ ట్రైన్ ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.