చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పేరుకి హెడ్ మాస్టర్. కానీ హెడ్ లేదు. ఆ హెడ్ లో ఆవగింజంత బుద్ధి కూడా లేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన హెడ్ మాస్టారే.. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓ కీచక హెడ్ మాస్టర్ ఓ మైనర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులంతా కలిసి కామాంధుడి భరతం పట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యా జిల్లా శ్రీరంగపట్నానికి చెందిన కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. కట్టేరి ప్రభుత్వ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న చిన్మయ ఆనంద మూర్తి.. ఒక హాస్టల్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థినులకు చెప్పింది.
వెంటనే విద్యార్థినులు అందరూ అలర్ట్ అయ్యి.. మూకుమ్మడిగా హెడ్ మాస్టర్ పై దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. అనంతరం మాస్టర్ ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు హెడ్ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే హెడ్ మాస్టర్ పై ఈ ఒక్క ఘటనలోనే కాదు.. గతంలో కూడా చాలా మంది విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఉన్నాయి. హెడ్ మాస్టర్ డ్యూటీ సాయంత్రం 5 గంటలకు అయిపోయినప్పటికీ.. ఆ తర్వాత కూడా అతను స్కూల్లోనే ఉంటాడని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. ఏం పని లేకపోయినా రాత్రి 12 గంటల వరకూ హాస్టల్ లో తిరుగుతూ ఉంటాడని అన్నారు.
హాస్టల్ లో ఏం పని అని ప్రశ్నిస్తే.. ఏదో పనుందని సాకు చెప్పేవాడని అన్నారు. అయితే విద్యార్థినుల కేకలు వినిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్లామని, గత మూడు, నాలుగేళ్ల నుంచి హెడ్ మాస్టర్ విద్యార్థినుల పట్ల తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పెద్ద పోస్ట్ లో ఉన్నాను కదా అని దాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయాలనుకున్నాడు. ఆడపిల్లలు వీళ్ళేం చేయగలరులే అనుకున్నాడు. ఎంత పెద్ద పాము అయినా చివరికి చలి చీమల చేతిలో చిక్కి చావాల్సిందే అనే పద్యం ఉంది. చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. ఆడపిల్లలే కదా.. చీమల్లా నలిపేస్తాం అంటే ఇదిగో రిజల్ట్ ఇలానే ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్థాయిలో ఉండి.. ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేస్తే.. విద్యార్థినులు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది.
ఈ ఆడపిల్లల్ని చూసైనా మిగతా ఆడపిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి. మగవారితో పోల్చుకుంటే ఆడవారికే ఎక్కువ శక్తి ఉంటుంది. బుద్ధి బలంలో, భుజ బలంలో ఆడవారిని మించిన శక్తిమంతులు లేరు. ఆమె ఆది పరాశక్తి. తలచుకుంటే సృష్టించగలదు, సృష్టిలో లేకుండా చేయగలదు. కాబట్టి ఆడవారి పట్ల, ఆడపిల్లల పట్ల జాగ్రత్తగా మెలిగితే మంచిదని ఈ ఘటన చూస్తేనే అర్థమవుతుంది. మరి హెడ్ మాస్టర్ తీరుపై ప్రతిఘటించిన విద్యార్థినులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
The victim immediately alerted other roommates and the students banded together and thrashed the headmaster.
The incident took place in #Katteri village of #Srirangapatna town in #Mandya district. The students belonged to the Katteri Government High School.#Karnataka pic.twitter.com/AXi4bvejGO
— Hate Detector 🔍 (@HateDetectors) December 15, 2022