విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
ర్యాగింగ్ అనేది ఇన్నాళ్లు కళాశాలల్లో వినిపించకపోయినా.. ఇప్పుడు మాత్రం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఓ నర్సింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ అంటూ వార్తలు కలకలం రేపుతున్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా వాటిల్లో మౌలిక వసతుల కొరతతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ సర్కారు కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటే ఎంత లక్షణంగా ఉంటారు. భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఆడపిల్లలు బొట్టు పెట్టుకున్నట్టే.. చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అయితే కొన్ని స్కూళ్ళు మాత్రం సాంప్రదాయాలను ఇంటి దగ్గర పెట్టుకుని రండి అంటూ కొత్త నిబంధనలు పెడుతున్నాయి. ఆ మధ్య అయ్యప్ప మాల ధారణలో పిల్లలు స్కూల్ కి వెళ్తే.. రానివ్వకుండా చేసింది ఓ స్కూల్ యాజమాన్యం. ఇప్పుడు మరో ట్రైనింగ్ స్కూల్ లో పని […]
చాలా మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ప్రైవేటు హాస్టల్స్ అయితే వసుతుల విషయంలో దాదాపుగా ఎలాంటి ఫిర్యాదులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టే అన్నట్లు మీరు కట్టే ఫీజులకు తగ్గట్లుగా అక్కడ వసతులు ఉంటాయి. అదే ప్రభుత్వ వసతి గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతుల కోసం నిధులు విడుదల చేస్తున్నా కూడా చాలా మంది వార్డెన్‌లు వాటిని వినియోగించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. […]
కొంతమంది యువకులు స్మార్ట్ ఫోన్లను అశ్లీల పనుల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ప్రమేయం లేకుండా.. వారి ఫోటోలు ఉంటే మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రొఫైల్ పిక్స్, డీపీలో ఉంటే ఆ ఫోటోలను కొంతమంది కామాంధులు తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల ముఖాలను.. కొన్ని అశ్లీల యాప్స్ ఉపయోగించి వేరే నగ్న చిత్రాలకు అతికించి తప్పుడు పనులకు […]
మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని పిల్లలతో బడిలో చెప్పిస్తారు. అంటే తల్లి, తండ్రి తర్వాత మరో దైవం గురువే అని. బడి అంటే చదువుల నిలయం, జ్ఞానం బోధించే ఆలయం. అలాంటి ఆలయంలో దేవుడి స్థానంలో ఉండాల్సిన గురువులు కొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కూతురి వయసున్న పిల్లలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ.. పిల్లలందరూ క్లాసులు మానేసి […]
నిత్యం ఏదో ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మద్యం తాగి వాహనాన్ని నడపడం, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటి వివిధ కారణలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రమైన గాయాలతో బతికి ఉన్న జీవిచ్ఛావాల్లా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అభంశుభం తెలియని ఎందరో చిన్నపిల్లలు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మణిపూర్ లో […]
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పేరుకి హెడ్ మాస్టర్. కానీ హెడ్ లేదు. ఆ హెడ్ లో ఆవగింజంత బుద్ధి కూడా లేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన హెడ్ మాస్టారే.. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓ కీచక హెడ్ మాస్టర్ ఓ మైనర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులంతా కలిసి కామాంధుడి భరతం పట్టారు. ఈ ఘటన […]
నేటికాలంలో నిజాయితీ అనేది చాలా మందిలో కొరవడింది. అందుకే పరుల సొమ్ము కోసం ఆరాట పడుతుంటారు. ఇంకా ఎక్కడైనా సొమ్ము దొరికితే మూడో కంటికి తెలియకుండా తీసుకెళ్లేవాళ్లే ఎక్కువ ఉన్నారు. అయితే కొద్దిమంది మాత్రమే తమకు దొరికిన సొమ్మును నిజాయితీగా పోలీలుకు ఇస్తుంటారు. కోట్లు రూపాయాలు దొరికిన పరుల సొమ్ము పాము వంటిది అని భావించేవారు కొందరు ఉంటారు. అయితే నిజాయితీకి ఆడ, మగ, చిన్న, పెద్ద అనే వాటితో సంబంధం ఉండదు. కొందరు పెద్దవారు.. నలుగురికి […]