ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులను వరుసగా తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో గత ఏడాది వరుసగా దిగ్గజ నటులు కన్నుమూశారు. రాజకీయ ప్రముఖ ల ఇంట కూడా వరుస విషాదలు నెలకొన్న విషయం తెలిసిందే..
ఇటీవల సినీ సెల్రబెటీలు, రాజకీయ ప్రముఖల ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మతృమూర్తి అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇంట విషాదం చోటు చేసుకుంది.. ఆయన మాతృమూర్తి పళనియమ్మాళ్ నాచియార్ తేనిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె వచసు 95 సంవత్సరాలు. ఈ సందర్భంగా పళని స్వామి మాట్లాడుతూ.. కొంత కాలంగా తన తల్లి పళనియమ్మాళ్ నాచియార్ వృద్దాప్యంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈమద్యనే ఆమె అస్వస్థతకు గురి కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. పళనియమ్మాళ్ నాచియార్ మృతి పట్ల రాజకీయ నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు.
2021 లో ఆయన సతీమణి భాగ్యలక్ష్మి గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. అదే ఏడాదిలో ఆయన సోదరుడు బాలమురుగన్ అనోరోగ్య కారణాల వల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు దివంగత సీఎం జయలలిత స్వీకరించారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె శిశ్యుడైన పన్నిరు సెల్వం కి సీఎం పదవి కట్టబెట్టింది. ఆమె మరణం తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎన్నికల్లో డీఎంకే పార్టీ తరుపు నుంచి ఎం కే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.