9 వేల మైళ్ల ప్రయాణం.. అందులో 13 గంటలు అప్పటికే ఆ విమానం ప్రయాణించింది. మరికొన్ని గంటలు అయితే చేరాల్సిన డెస్టినేషన్ కూడా వస్తుంది. కానీ ఇంతలోనే ఆ పైలట్ యూటర్న్ తీసుకుని టేకాఫ్ అయిన చోటుకే మళ్లీ విమానాన్ని తీసుకెళ్లాడు. దాంతో ఈ అనూహ్య ఘటన చూసి అవాక్కైయ్యారు ప్రయాణికులందరు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన విమానయాన రంగంలో కలకలం రేకెత్తించింది. దుబాయ్ నుంచి ఆక్లాండ్ వెళ్లాల్సిన విమానం అర్ధాంతరంగా అర్దరాత్రి ఎక్కడి నుంచి వెళ్లిందో మళ్లీ అక్కడికే వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దుబాయ్ నుంచి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు బయలుదేరింది ఈకే448 విమానం. శనివారం ఉదయం 10.30 గంటలకు దుబాయ్ నుంచి టేకాఫ్ అయిన ఈ ఎమిరేట్స్ విమానం 13 గంటలు గాల్లో ప్రయాణించిన తర్వాత తిరిగి తిరిగి మళ్లీ టేకాఫ్ అయిన దుబాయ్ ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండ్ అయ్యింది. 9 వేల మైళ్ల ట్రిప్పులు ఆ విమానం అప్పటికే సగం దూరం వెళ్లింది. కానీ తర్వాత యూటర్న్ తీసుకుని శనివారం అర్దరాత్రి మళ్లీ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడే వాలింది. దానికి కారణం ఏంటంటే.. ఆ విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఆక్లాండ్ ఎయిర్ పోర్ట్ లో వరదలు పొటెత్తాయి. దాంతో అక్కడి అధికారులు ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. ఫలితంగా ఈకే448 విమానం తిరిగిరాక తప్పలేదు.
ఇక ఈ ఘటనపై ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించారు. ఇది మాకు కూడా ఎంతో ఇబ్బంది కరమైన సంఘటన. కానీ ప్రయాణికులు భద్రత మాకు ముఖ్యం. తమ ఇంటర్ నేషనల్ టర్మినల్ కు జరిగిన నష్టాన్ని గురించి అధికారులు అంచానా వేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొందరు ప్రయాణికులు తాము సురక్షితంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మా విలువైన సమయం వృథా అయ్యిందని బాధపడుతున్నారు. మరి 13 గంటలు గాల్లో ప్రయాణించి.. మళ్లీ అక్కడికే వచ్చిన ఈ విమాన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.