దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం ఏర్పడింది. రాజధానితో పాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో అనేక బలమైన ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 30 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. భూకంప కేంద్రం నేపాల్ లో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది.
భూకంప కేంద్రం లోతు 10 కిలో మీటర్లు ఉండవచ్చునని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భావిస్తుంది. నోయిడా, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం భూమి కంపించిన సమయంలో అనేక మంది కార్యాలయాల్లో ఉండటంతో వస్తువులు కదిలినట్లు పలువురు చెబుతున్నారు. మరి కొంత మంది బయటకు పరుగులు తీశారు. కొంత మంది ఇంటిలో ఫ్యాన్లు, వస్తువులు కదిలిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Felt the tremors of the #earthquake in Delhi. pic.twitter.com/xTIBi3oiqW
— roobina mongia (@roobinam) January 24, 2023
#earthquake in Delhi and NCR…all office vacated in Noida pic.twitter.com/u3OsfO4YrR
— Abhishek Shrivastava (@abhishri2014) January 24, 2023