ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో జరిగిన భూకం ప్రళయానికి 50 మంది బలి అయ్యారు. అప్పటి నుంచి భూ కంపం అనే పేరు వినిపిస్తే చాలు వెన్నుల్లో వణుకు పుడుతుంది. భారత్ లో కూడా ఈ మద్య వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, లక్నో, హర్యానా, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా భారత్ సహా పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ లో సైతం భూప్రకంపనలు ఏర్పడ్డాయి.
ఎపిలో పలు చోట్ల భూమి కంపించింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో భూ కంపం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ప్రకృతి ప్రకోపానికి భారీ మూల్యం చెల్లించుకున్నాయి టర్కీ, సిరియా దేశాలు. ఊహించని విపత్తులు ఒక్క సారిగా ఆ దేశాల రూపు రేఖలను మార్చేశాయి. వరుసగా సంభవించిన భూకంపాల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. పుండుపై రోకలి పోటులా ఇంకా ఇప్పటికీ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం కూడా సెంట్రల్ టర్కీలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.6గా నమోదైంది. దీంతో భయం […]
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాల్లో సోమవారం వరుస భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. సోమవారం ఉదయం జరిగిన ప్రకృతి విపత్తులో సుమారు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. అపార్ట్ మెంట్లు, ఆసుపత్రులు ఒక్కటేమిటీ నివాసాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఇంకా శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని […]
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియా దేశాలు కకావికలం అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు చోటుచేసుకోవడంతో భారీ అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం ఉంటోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 2300 దాటిపోగా, క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉంది. ఇవి అధికారిక లెక్కల మాత్రమే. భవన శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో మొదలైన ఈ ప్రకృతి విపత్తులు, మధ్యాహ్నం, సాయంత్రం […]
రోమన్ల రాజ్యంగా పిలుచుకునే టర్కీలో ప్రకృతి విలయతాండవం సృష్టిస్తోంది. వరుసగా గంటల వ్యవధిలోనే రెండోసారి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది. ఇప్పటికే సోమవారం తెల్లవారు జామున 4.17 గంటల సమయంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 1500 మందికిపైగా మరణించారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోసారి భూకంపం సంభవించింది. దీంతో మృతుల సంఖ్య […]
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం ఏర్పడింది. రాజధానితో పాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో అనేక బలమైన ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 30 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. భూకంప కేంద్రం నేపాల్ లో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంప కేంద్రం లోతు 10 కిలో మీటర్లు ఉండవచ్చునని నేషనల్ సెంటర్ ఫర్ […]
భూమి మీద నిత్యం ఎక్కడో ఒకచోటు ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువుగా సంభవిస్తుంటాయి. ఇక భూకంపాల కారణంగా జరిగే ప్రాణ, ఆస్తి నష్టం ఎలా ఉంటుందో ఇప్పటికే మనం అనేకం చూశాం. అకస్మాత్తుగా సంభవించే భూకంపాల కారణంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ఘటనలో ఆరు మంది మరణించారు. నేపాల్ లో ఏర్పడిన భూకంప ప్రభావం భారత్ […]
క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో అప్పుడప్పుడు ప్రకృతి ఆటంకం కలిగిస్తుండటం సహజం. వర్షం రావడం, లైట్ పోవడం, పొగ మంచు అధికంగా ఉండటం మనం తరుచూ చూస్తూనే ఉంటాము. కానీ.., క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఏకంగా భూకంపమే వస్తే..? వినడానికే విచిత్రంగా ఉంది కదా? ఈ ఆశ్చర్యకర ఘటన వెస్టిండీస్ లో జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సమయంలో ఇది చోటుచేసుకుంది. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా ప్లే ఆఫ్ సెమీ ఫైనల్ మ్యాచ్ […]