ఇటీవల భారత్ లో భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 8.01 గంటలకు జైపూర్‌కు వాయువ్యంగా 92 కి.మీ దూరంలో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లేదా ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.
ఇది చదవండి: ఇంజనీర్లను ఆశ్చర్యపరిచేలా రైతు సూపర్ ఐడియా!
ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసినట్లు సమాచారం. ఈ నెల ప్రారంభంలో అఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. అలాగే భారత్ లోని ఢిల్లీ, జమ్మూకశ్మీర్, నోయిడా, ఉత్తరాఖండ్ లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.