నేటి కాలంలో చాలా మంది ఇంట్లో కుక్కలను ప్రేమగా పెంచుకుంటున్నారు. అలా వారు పెంచుకుంటున్న క్రమంలో వారి పట్ల విశ్వాసంగా ఉంటూ కాపలాగా ఉంటుంది. అలా కొన్నాళ్లు ప్రేమగా చూసుకున్న కుక్క మరణించడంతో కొంతమంది ఈ నిజాన్ని జీర్ణించుకోలేరు. అలా ప్రేమగా పెంచుకున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉండే కుక్క మరణించడంతో ఏకంగా పాలరాతితో విగ్రహాన్ని కట్టించాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది ఎక్కడో అనుకుంటున్నారా?
ఇది కూడా చదవండి: ఆ ఒక్క ఫొటోతో సెలెబ్రిటీ అయిపోయిన పోలీస్ కానిస్టేబుల్
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని పట్టణంలో మన మధురై పట్టణానికి చెందిన ముత్తు అనే 82 ఏళ్ల వ్యక్తి రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఎంతో ప్రేమగా 2010 నుంచి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క గత ఏడాదిలో మరణించింది. ఆ కుక్క జ్ఞాపకార్థంగా రూ.80 వేల ఖర్చుతో పాలరాతి విగ్రహాన్నినిర్మించాడు. కుక్క విగ్రహానికి ప్రతీరోజు పూల మాల వేసి, నైవేద్యం సమర్పిస్తున్నామని, మా తాత, నాన్న, నేను జంతువు ప్రేమికులమని ముత్తు కుమారుడు మనోజ్ కుమార్ చెప్పారు. కుక్కకు విగ్రహం కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.