గతంలో పడక గదికి పరిమితమైన కొన్ని వ్యవహారాలు.. నేడు అరచేతిలో ఫోన్లలో ప్రత్యక్షమవుతన్నాయి. దీంతో విచ్చల విడి శృంగారం పెరిగిపోతుంది. అంతర్జాలంలో విచ్చల విడిగా పోర్న్ వీడియోలు చూస్తూ అదే శృంగారమని భావిస్తున్నారు.
సెక్స్ అనేది బూతు అనే కోణం నుండి అదీ మనిషికి అవసరం అన్నట్లు మారిపోయింది. గతంలో పడక గదికి పరిమితమైన కొన్ని వ్యవహారాలు.. నేడు అరచేతిలో ఫోన్లలో ప్రత్యక్షమవుతన్నాయి. దీంతో విచ్చల విడి శృంగారం పెరిగిపోతుంది. అంతర్జాలంలో విచ్చల విడిగా పోర్న్ వీడియోలు చూస్తూ అదే శృంగారమని భావిస్తున్నారు. వీటికి అలవాటు పడిపోతున్నారు నేటి యువత. ఆ వీడియోలను చూడకుండా ఉండలేకపోతున్నారు. వీటిని చూస్తూ భార్యపై ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భర్త. దీంతో కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా పోర్న్ వీడియోలకు అలవాటు పడ్డ భర్త.. భార్యపై రోజూ అఘాయిత్యానికి ఒడిగడుతుండటంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఈస్ట్ రోహ్తాష్ నగర్ కు చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2020లో పెళ్లి జరిగింది. అయితే తొలుత అన్యోన్యంగా ఉన్న భర్త.. తర్వాత తర్వాత పోర్న్ వీడియోలకు అలవాటు పడ్డాడు. వాటిని చూపిస్తూ అలా శృంగారం చేయాలంటూ ఆమెను హింసించే వాడు. తన ఫేవరేట్ పోర్న్ స్టార్లా దుస్తులు ధరించాలని భార్యపై తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. తట్టుకోలేక అత్తమామలకు చెబితే.. కొడుక్కి వత్తాసు పలికారు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త టార్చరే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు, మానసికంగా, శారీరకంగా హింసించే వారని పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీసీలోని 498ఎ, 406, 377 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.