ఇంట్లో గొడవలు సాధారణం. ముఖ్యంగా అత్త, కోడళ్ల మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. అత్త పెత్తనం కోడలికి నచ్చక, కోడలు చేసే పనులు అత్తకు నచ్చక.. రోజూ ఇంట్లో పోరు మొదలవుతుంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల నుండి జుట్టు జుట్టు పట్టుకుని చేరే వరకు వెళ్లిపోతాయి తగాదాలు.
భార్యా భర్తలు ఓ విషయంపై మాట్లాడుకుంటున్నారట. ప్రతి కోడల్ని అత్తా మామలు కూతురిగా భావిస్తే అస్సలు గొడవలే ఉండవని భార్య అనగా.. ఇంటికి వచ్చిన కోడలు తమ అత్తమామలను.. తల్లిదండ్రులుగా భావిస్తే గొడవలే కాదూ అనాథాశ్రమాలు కూడా ఉండవని భర్త అన్నాడట. ఇది అక్షర సత్యం. ఇంట్లో గొడవలు సాధారణం. ముఖ్యంగా అత్త, కోడళ్ల మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. అత్త పెత్తనం కోడలికి నచ్చక, కోడలు చేసే పనులు అత్తకు నచ్చక.. రోజూ ఇంట్లో పోరు మొదలవుతుంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల నుండి జుట్టు జుట్టు పట్టుకుని చేరే వరకు వెళ్లిపోతాయి తగాదాలు. ఆస్తి కోసం అత్తమామాలను రోజు చిత్ర హింసకు గురి చేసే కోడళ్లు ఉన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఒక్కోసారి అత్తదీ పైచేయి అయితే.. మరోసారి కోడలిది.
ప్రస్తుతం అత్తా, కోడళ్లు తన్నుకున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. అత్తపై శివంగిలా దూసుకెళ్లిన కోడలు.. ఆమె చెంప చెల్లుమనిపించింది. ఆ తర్వాత జుట్టు,చెవులు పట్టుకుని సోఫాలో పడేసి తన్నింది. అనంతరం అత్త బుగ్గపై గట్టిగా కొరికేసింది. వీరి గొడవను ఆపేందుకు వచ్చిన ఓ పెద్ద వయస్కుడిని కూడా కోడలు కాలితో తన్నింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ చిన్న పిల్లల ముందే జరగడం గమనార్హం. ఈ వీడియో క్లిప్‌లో ఏడు లేదా ఎనిమిదేళ్ల చిన్నారి ఉండటం కనిపిస్తుంది.
కాగా, ఈ వీడియోను దీపికా నారాయణన్ భరద్వాజ్ అనే మహిళ నెటిజన్ షేర్ చేస్తూ.. ఆస్తి విషయంలో అత్తపై కోడలు చేసిన దాష్టీకం అని పేర్కొంటూ ఆమెపై చర్యలు తీసుకోవాలని సూరత్ సిటీ సీపీ పేరును పేర్కొంది. దీనిపై అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లో జరిగిన గొడవను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరికాదంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరికొందరు వీడియో పక్షపాతంగా, ఏకపక్షంగా ఉందని అన్నారు. అయితే కోడలిపై కేసు పెట్టినట్లు సమాచారం.
Daughter-In-Law beats up and bites old mother-in-law in a fight over property. Take action against her @CP_SuratCity pic.twitter.com/8zr8RhDkUA
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 25, 2023