పన్నులు ఎగ్గొట్టే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపడం అనేది సర్వ సాధారణ విషయం. అయితే అసలు తన జీవితంలో ఆదాయ పన్ను కట్టే ఆర్ధిక స్థోమత లేని, అసలు పాన్ కార్డే లేని ఒక సాధారణ కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ వారు నోటీసులు పంపించారు. అది కూడా లక్షల్లో పన్ను చెల్లించాలని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. డైలీ రూ. 500 సంపాదిస్తాడు. అలాంటి ఈయనకి రూ. 37.5 లక్షల పన్ను కట్టాలని నోటీసులు వచ్చాయి. దీంతో అతను షాక్‌కి గురయ్యాడు. ఆ నోటీసులో అతడి పేరు, పాన్ కార్డ్ నంబర్ ఉన్నాయి.
అంతేకాదు రాజస్థాన్‌కు చెందిన కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తి.. “నేనెప్పుడు రాజస్థాన్ వెళ్ళానండి బాబు” అని అయోమయానికి గురయ్యాడు. వెంటనే పోలీసులను కలిసి విషయం చెప్పాడు. తనకు కనీసం పాన్ కార్డ్ కూడా లేదని, ఢిల్లీలో పనిచేసినప్పుడు పాన్ కార్డ్ కోసం అప్లై చేసినా రాలేదని, అసలు రాజస్థాన్ కంపెనీ గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇతని పేరు మీద ఎవరో ఫ్రాడ్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరి పాన్‌కార్డ్ లేని కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#Bihar daily wager gets IT notice of Rs 37.5 lakh #BiharNews #incometax https://t.co/3UEAhFwpWb
— India.com (@indiacom) August 21, 2022