దేవుడి ముసుగులో కొందరు స్వామిజీలు,బాబాలు, మత గురువులు, భూతవైద్యులు ఆడ పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు. దెయ్యం పట్టిందని, అనారోగ్య సమస్యలు పోయి అదృష్టం వరించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి..
దేవుడి ముసుగులో కొందరు స్వామిజీలు, బాబాలు, మత గురువులు, భూతవైద్యులు ఆడ పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు. దెయ్యం పట్టిందని, అనారోగ్య సమస్యలు పోయి అదృష్టం వరించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి.. వారి నిస్సహాయ స్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. తాము దైవాంశ సంభూతులమని చెప్పుకుని.. ప్రజలను మభ్యపెడుతుంటారు. గాలిలో నుండి విభూదులు తీయడం, తలపై చేయి పెట్టి దుష్ట శక్తులను పారదోలామని చెప్పడంతో.. అదే నిజమని నమ్మి, వారు చెప్పినట్లు చేస్తున్నారు. వెనుకా ముందు ఆలోచించకుండా చేస్తున్నచర్యల వల్ల ఆడపిల్లల మాన, ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. దైవం పేరు చెప్పుకుని అమ్మాయిల కామ కోరికలు తీర్చుకుంటున్నారు మత గురువులు.
బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఓ మత గురువు తన కక్కుర్తి బుద్ది చూపించాడు. ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీర్ బాబా సమాధి వద్ద భూతవైద్యం చేసుకుని బతుకుతున్నాడు సలావుద్దీన్ అన్సారీ. భూత వైద్యం కోసం ఆ చుట్టూ పక్కల వారు.. అతడిని ఆశ్రయిస్తూ ఉంటారు. కాగా, ఓ విద్యార్థిని అతడి వద్దకు రాగా, మాటలు కలిపాడు అన్సారీ. తన మాయ మాటలతో ఆమెను తన వైపు తిప్పుకున్న అతడు ఆ బాలికతో సరససల్లాపాల్లో మునిగి తేలాడు. ఆమెను కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకున్నాడు. తొలుత విద్యార్థిని దూరంగా జరిగింది. ఆ తర్వాత ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. అన్సారీని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు రావడంతో.. ఈ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
#India: #Bihar Horrific news shocked Siwan District, An Islamic cleric was caught on camera doing obscene acts with a minor girl student, Accused on the run pic.twitter.com/1nXccslu1P
— Ashwini Shrivastava (@AshwiniSahaya) July 29, 2023