Crocodile: ఓ సినిమాలో చిరంజీవి ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టు.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ మొసళ్ల పండగ వచ్చినట్టే ఉంది. వరదల కారణంగా ఎప్పుడూ లేని విధంగా మొసళ్ళు రోడ్ల మీదకు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గుజరాత్ లోని వడోదర గ్రామంలో మొసళ్లు రోడ్లపైకి కొట్టుకొస్తున్నాయి. వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అక్కడకి చేరుకొని మొసలిని సురక్షితంగా తరలించారు.
స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు బాగా ప్రసిద్ధి. ఈ నదిలో వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతుండడంతో నీరు అనేక ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఈ నీళ్లతో పాటే మొసళ్ళు కూడా రోడ్లపైకి, వీధుల్లోకి కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇటీవలే పూజా గార్డెన్ సమీపంలోకి ఒక మొసలి వచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించి, సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టారు.
ఇలా మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగుతున్నాయి. వరదల ప్రభావం మనుషుల మీద ఎలాగుందో గానీ…మొసళ్ల మీద మాత్రం బాగా పడింది. మొసళ్ళు ఇలా జనావాసాల్లోకి వస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: బాలుడ్ని మింగేసిన మొసలి.. కట్టేసి కాపలా కాసిన గ్రామస్తులు.. ఎందుకంటే..