ఉత్తర భారతదేశంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో డ్యాం పొంగిపొర్లుతుంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
ఉత్తర భారతదేశంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో డ్యాం పొంగిపొర్లుతుంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలోని యమున నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని మించింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి రోడ్లకు అడ్డంగా పడడంతో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. శిథిలాల కింద నుండి పౌరులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని పూర్తి వివరాలను తెలుసుకుందాం..
గత మూడురోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 71 మంది మరణించగా.. 13 మంది శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తుంది. పర్వతాల మీద మౌలిక సౌకర్యాలను కల్పించడం సవాలుగా మారిందని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. ఇప్పటి వరకు భారీ వర్షాల వల్ల దాదాపు 10,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సిమ్లాలోని సమ్మర్ హిల్ వద్ద శివాలయం శిథిలాల నుండి మరో మహిళ మృత దేహం స్వాధీనం చేసుకున్నారు. వర్షాల కారణంగా చనిపోయిన 57 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడడంతో.. వరదల వల్ల కూలిపోయిన భవనాల కింద మృతదేహాలు లభ్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. గత మూడురోజుల్లో 71 మంది చనిపోగా.. 13 మంది ఆచూకీ తెలియరాలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.
సమ్మర్ హిల్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు. కృష్ణానగర్ లో దాదాపు 15 ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ తెలిపింది. హిమాచల్ యూనివర్సిటీ ఆగస్టు 19 వరకు అన్ని కార్యక్రమాలను నిలిపివేసింది. దీనికి ముందు జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని మండి, కులు, సిమ్లా మొదలైన ప్రాంతాల్లో చాలామంది మరణించారు. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. ఇటీవల మరల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, మరమ్మత్తుల కోసం రూ.2,000 కోట్లు నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్ని హోత్రి కేంద్రాన్ని కోరారు.