ప్రస్తుతం సమాజంలో దొంగతనాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. చూడటానికి చాలా డాబుగా కనిపిస్తారు. కానీ వారు చేసే పనులు మాత్రం నీచంగా ఉంటాయి. ఆ కోవకు చెందినదే ఈఘటన. కారులో వచ్చి మేకను దొంగిలించి, అక్కడి నుంచి నిమిషాల్లో వెళ్లి పోయారు సీసీ ఫుటేజ్ ద్వారా వారి చిల్లవ బుద్ధి బయటపడింది.
సాధారణంగా మనం ఇంట్లో దొంగలు పడి డబ్బులు దొంగతనం చేయడం, బంగారం దొంగిలించడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కాస్ట్లీ చీరలు, విలువైన ఐటమ్స్ ఎత్తుకెళ్తారు. ఒక్కోచోట కొన్ని ఇంట్లో వస్తువులను కూడా దొంగతనం చేయడం చూస్తుంటాం. అయితే ఓ ఊరిలో దొంగలు మేకను దొంగిలించారు. అది కూడా ఎలాగంటే లగ్జరీ కారులో వచ్చి మరీ మేకను దొంగిలించారు. కార్లలో వచ్చిన వ్యక్తులు చాలా హైలెవెల్ పొజిషన్‌లో ఉన్నవారిగా భావిస్తాం. చూడటానికి చాలా డాబుగా కనిపిస్తారు. కానీ వారు చేసే పనులు మాత్రం నీచంగా ఉంటాయి.అలాంటి వారి కోవకు చెందినదే ఈఘటన. కారులో వచ్చి మేకను దొంగిలించి, అక్కడి నుంచి నిమిషాల్లో వెళ్లి పోయారు. సీసీ ఫుటేజ్ ద్వారా వారి చిల్లర బుద్ధి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లగ్జరీ దొంగలు ఎక్కడ మేకను దొంగిలించారన్న వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ కాలనీలో రోడ్డుపై ఒక లగ్జరీ కారు ఆగి ఉంది. కొందరు దుండగులు వీఐపీ నంబర్ ప్లేట్ ఉన్న లగ్జరీ కారులో వచ్చారు. ఒక మేక నడుచుకుంటూ కారు సమీపానికి వచ్చింది. వెంటనే కారు డోర్ తెరిచి మేకను కారులోకి తీసుకున్నారు. ఈ దృశ్యం కాస్త సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్‌గా మారింది. అక్కడ కొంత దూరంలో ఒక మేక తిరుగుతున్నది. మేక కొంతసేపటికి కారు దగ్గరగా వెళ్లింది. అంతే వెంటనే కారులో ఉన్న దుండగులు మేకను కారు లోపలికి తీసుకున్నారు. కారు డోర్ వేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే మేక యజమాని ఆరిఫ్. తన మేక కనిపించడం లేదని స్థానిక గోమతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. గురువారం కొంతమంది యువకులు కారులో వారి కాలనీకి వచ్చినట్లు ఆరిఫ్ చెప్పాడు. ఆ యువకులు కారు దిగి కొద్దిసేపు చుట్టు పక్కల చూస్తూ ఉన్నారని తెలిపాడు. ఆ తర్వాత వీధిలో ఉన్న తన మేకను దొంగిలించారని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.