కార్తీకమాసం వచ్చిదంటే శబరిమలకు వెళ్లే యాత్రికుల సంఖ్యా పెరుగుతుంది. దేశనలుమూలల నుంచి యాత్రికులు, స్వామి మాలలు ధరించిన స్వాములు బస్సులో శబరిమలకు వస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. దీక్ష పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి ముడుపులు చెల్లించేందుకు శబరిమలకు బయలుదేరతారు. ఈ క్రమంలో శబరిమల వస్తున్నా యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులతో శబరిమల వెళ్తుండగా కేరళలోని పతనం తిట్ట సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. బస్సు కుడి పక్కకి తిరగబడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
A bus carrying Sabarimala pilgrims from Andhra met with an accident at Pathanamthitta. Ten injured pic.twitter.com/5elRJ8LCvi
— Jisha Surya (@jishasurya) November 19, 2022
క్రేన్ సహాయంతో బస్సుని బయటకు తీసి.. అందులో ఉన్న యాత్రికులను రక్షించారు. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో పిల్లలతో సహా 40 మంది యాత్రికులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొండ ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
#Sabarimala pilgrimage :
Bus with pilgrims from #AndhraPradesh met with an accident @ Laha
Out of 40 passengers, 18 suffered injuries, 3 were said to be critical that includes a child #SabarimalaAyyappan #Kerala #news @AndhraPradeshCM @BJP4Andhra @governorap @APPOLICE100 pic.twitter.com/KJ7Vrjau0w
— Dileep V Kumar (@dvk_dileep) November 19, 2022