అంజలి నటించిన షాపింగ్ మాల్ సినిమా నటి సింధు తుది శ్వాస విడిచారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె దీనస్థితిలో మరణించారు.
తెలుగులో అంజలి షాపింగ్ మాల్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సింధు (44) అనే నటి నటించారు. ఆమె రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ ఆగస్టు 7న సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. 2020లో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. రొమ్ము క్యాన్సర్ బారిన పడడంతో జీవితం తలకిందులు అయ్యింది. అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దీనికి తోడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొంత కాలం క్రితం సింధు.. క్యాన్సర్ చికిత్స కోసం ఎవరైనా తనకు ఆర్థిక సాయం చేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించింది. కార్తీ, గణేష్, సతీష్ కుమార్ వంటి సెలబ్రిటీలు ముందుకొచ్చి ఆసుపత్రి ఖర్చులు భరించారు.
చనిపోయే ముందు కిల్ పాక్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు చికిత్సలు చేయించుకుంది. అయితే పరిస్థితి చేజారిపోవడంతో ఆమె సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని నటుడు, కమెడియన్ కొట్టాచి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం 2:15 గంటలకు సినీ నటి సింధు సహజ మరణం పొందారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు. ఆమె అభిమానులు, ఆరాధించే వాళ్ళు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సింధు బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఆమె సినీ ప్రయాణం అంత గొప్పగా ఏమీ జరగలేదు. పేదరికం కారణంగా ఆమె ఇండస్ట్రీలో చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది.
14 ఏళ్లకే ఆమెకు పెళ్లయిపోయింది. చిన్న వయసులోనే ఆమె ఒక చిన్నారికి తల్లి అయ్యింది. ఈమె తన భర్త వల్ల చాలా నరకం అనుభవించారని, అతను మంచివాడు కాదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2010లో వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన అంగడి తేరు, నాడోడిగల్, నాన్ మహాన్ అల్లా, తేనవెట్టు, కరుప్పసామి కుదకైతరర్ వంటి సినిమాల్లో నటించారు. పలు టీవీ షోస్ లో కూడా చేశారు. తెలుగు హీరోయిన్ అంజలి నటించిన ‘షాపింగ్ మాల్’ సినిమాలో సింధు ఓ పాత్రలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. అయితే 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడడంతో జీవితం తలకిందులు అయ్యింది. అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దీనికి తోడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
Actress Sindhu passes away, was unable to afford breast cancer treatment #Cancer #ActressSindhu pic.twitter.com/q8eDOKeXnG
— Bollywood Nazar (@BollywoodNazar) August 7, 2023