ప్రముఖ నటుడు కన్నుమూశారు. కమల్ హాసన్ తో కలిసి నటించినటువంటి నటుడు దీనస్థితిలో మృతి చెందారు. రోడ్డు పక్కన అనాథగా మృతదేహం పడి ఉండడంతో పోస్టుమార్టం చేస్తేనే గానీ గుర్తుపట్టలేని స్థితిలో పడున్నారు. ఆయన ఎవరంటే?
ప్రముఖ నటుడు కన్ను మూశారు. కమల్ హాసన్ తో కలిసి ఓ సినిమాలో నటించిన నటుడు అనుమాస్పద స్థితిలో మృతి చెందారు. చివరి క్షణాల్లో చాలా దీన స్థితిలో జీవించి కన్ను మూశారు. మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నటుడు అద్వాన స్థితిలో మృతి చెందడం బాధిస్తుంది. అవకాశాలు లేక కొన్నాళ్లుగా భిక్షాటన చేసుకుని జీవిస్తున్నారని.. అనారోగ్య సమస్యల కారణంగా మరణించారని అంటున్నారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియ రథం వీధి దగ్గర వెళ్ళింగిండ్రు వద్ద రోడ్డు పక్కన ఓ మృతదేహం పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు మంగళవారం సాయంత్రం తెలియజేశారు.
ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విచారణ చేపట్టగా ఆ మృతదేహం సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన నటుడు మోహన్ దని తెలిసింది. మోహన్ విచిత్ర సోదరులు సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించారు. ఇందులో కమల్ హాసన్ కి స్నేహితుల్లో ఒకరిగా నటించారు. నాన్ కడవుల్, అతిశయ మనిదర్ గళ్ వంటి సినిమాల్లో నటించారు. 2009లో బాల దర్శకత్వంలో వచ్చిన నాన్ కడవుల్ సినిమాలో నటించారు. ఆర్య, పూజ నటించిన ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో నేనే దేవుణ్ణి పేరుతో విడుదలైంది. మోహన్ తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేసినప్పటికీ గుర్తిండిపోయేలా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాంటి నటుడు అకస్మాత్తుగా మృతి చెందడం తమిళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. సినిమా అవకాశాల కోసం మోహన్ చాలా స్ట్రగుల్ అయ్యారని తెలుస్తోంది. సేలంకి చెందిన మోహన్ మధురై వెళ్ళడానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మోహన్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సినిమా అవకాశాల కోసమే మధురై వచ్చాడని.. ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశాలు రాలేదని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవకాశాలు లేక కొన్నాళ్ళుగా భిక్షాటన చేసుకుంటున్నాడని.. పేదరికం, అనారోగ్య సమస్యలు కారణంగా చనిపోయాడని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నటుడికి ఇద్దరు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.