ఈ మద్య కాలంలో పెళ్ళిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి.. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెళ్లి పూర్తయ్యే వరకు అంతా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక పెళ్లి బారాత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ మద్య కొంతమంది పెళ్లిళ్లు చాలా గ్రాండ్ గా వెరైటీగా జరుపుకుంటున్నారు. జీవితంలో పెళ్లి అనేది ఓ తీపి జ్ఞాపకం. ఆ మధురానుభూతి అందరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని తమ తాహతకు తగ్గట్టుగా వివాహ కార్యక్రమాలు జరుపుతున్నారు. నేల, ఆకాశం, సముద్రం ప్రదేశం ఏదైనా పెళ్లి చాలా వెరైటీగా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎంట్రీని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో చూస్తునే ఉంటాం. కొన్ని పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు.. బంధువులు డబ్బులు వెదజల్లడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లికొడుకు ఏనుగు అంబారి ఎక్క డ్యాన్స్ చేయడమే కాదు.. నోట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటన గుజారాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ భావ్నగర్ జిల్లాకు చెందిన రమేష్ భగవాన్ కొడుకు కుల్ దీప్ కి గర్ధా ప్రాంతానికి చెందిన వైశాలీ అనే అమ్మాయితో ఫిబ్రవరి 23న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి భారాత్ చాలా గ్రాండ్ గా ఏర్పాడు చేశారు. పెళ్లి కొడుకు ఏనుగుపై ఎక్కి చేతిలో తల్వార్ పట్టుకొని కొద్ది సేపు డ్యాన్స్ చేశాడు. అంతేకాదు నోట్లను కిందకు వెదజల్లుతూ స్టెప్పులు వేశాడు. ఈ తంతు చూడటానికి గర్దా వాసులు రోడ్లపైకి ఎగబడ్డారు.
ఇక పెళ్లి బారాత్ లో పెళ్లి కొడుకు ఏనుగుపై డ్యాన్స్ వేస్తూ డబ్బులు వెదజల్లాడు. ఊరేగింపు సందర్భంగా ఏనుగపై కుల్ దీప్ బయలు దేరుతుండగా వెనుక నుంచి ఖరదీదైన లగ్జరీ కార్లలో అనుసరిస్తూ డబ్బులు వెదజల్లుతూ వచ్చారు. పెళ్లి బారాత్ జరుగుతున్న సమయంలో దాదాపు కీలో మీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎంత డబ్బు ఉంటే మాత్రం రోడ్డుపై ఇలా డబ్బులు విసురుతారా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.