ఈ మద్య రాజకీయ నేతలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పపడుతున్నారు. పోలీసుల భద్రత ఎంత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి..
ఇటీవల రాజకీయ నేతలపై ప్రత్యర్థులు దాడులు నిర్వహించడం చూస్తేనే ఉన్నాం. అయితే ఈ దాడుల్లో కొన్నిసార్లు నేతలు ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉన్నా.. ప్రత్యర్థులు ఏదోఒక విధంగా దాడులు చేస్తున్న ఘటనలు ఎన్నో జరిగాయి. బీజేపీ మంత్రిపై ఓ అజ్ఞాత వ్యక్తి దాడి చేయడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లో ఇటీవల బీజేపీ చేపట్టిన వికాస్ రథయాత్రకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ యాత్రలో పాల్గొన్న బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ పై ఓ యువకుడు దాడి చేయడం కలకలం సృష్టించింది. దాంతో యాత్ర ఒక్కసారిగా ఆగిపోయింది. మంత్రి బ్రజేంద్ర సింగ్ మంగవోలిలో జరుగుతున్న వికాస్ రథయాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మంత్రిపై దురుద పుట్టించే పౌడర్ చల్లాడు. దీంతో మంత్రి బ్రజేంద్ర సింగ్ కు విపరీతమైన దురుద రావడంతో నడిరోడ్డుపైనే తన బట్టలు విప్పి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుకున్నారు. అక్కడ ఉన్న అధికారులు వెంటనే అలర్ట్ అయి ఆయనను సురక్షితమైన ప్రదేశానికి తీసుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఈ వీడియలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ ని పట్టుకొని మాజీ సర్పంచ్ మీకు ఈ యాత్ర అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మూడు కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు.. ప్రజల్లోకి యాత్ర అంటూ ఎలా వస్తారని ప్రశ్నించారు సర్పంచ్. దీంతో ఆ సర్పంచ్ ని మంత్రి బుజ్జగించారు. రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలో వికాస్ రథయాత్ర రోడ్డులో ఇరుక్కుపోయి ఆటంకం ఏర్పడింది. కాగా, వికాస్ యాత్ర మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభిచారు. ఫిబ్రవరి 25 వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
अशोकनगर, मध्य प्रदेश
जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा।
PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर।
खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy
— काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023