సాధారణంగా తప్పిపోయిన వాళ్లు తిరిగి రారని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతుంటారు.. కానీ వాళ్లు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులుఉండవు.
సాధారణంగా అనుకోని కారణాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం.. జీవితంపై విరక్తి కలిగిన వారు ఇంటి వాళ్లకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోతారు. కొన్నిసార్లు వారు చనిపోయిన వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరు అవుతుంటారు. కొంతమంది చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తుంటారు.. అలా వచ్చిన వాల్లను చూసి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోతుంటారు. తాజాగా బీహార్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోని భాగల్‌పూర్ కు చెందిన నిశాంత్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు నెలల క్రితం తన చుట్టాల ఇంటికి పెళ్లికోసం వెళ్లి తప్పిపోయాడు. నోయిడాలోని మోమోస్ స్టాల్ లో తింటూ కనిపించాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటీ అని అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తే.. నిశాంత్ కుమార్ ని అతని బావమరిదే కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కానీ తప్పిపోయిన వ్యక్తి ఆచూకి మాత్రం అతని బావమరిది రవిశంకర్ సింగ్ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నోయిడాలోని సెక్టార్ 50 లో ఒక మోమోస్ స్టాల్ వద్ద బిచ్చగాడిలా ఉంటూ.. అహారం కోసం అలమటిస్తున్న నిశాంత్ కుమార్ ని రవిశంకర్ సింగ్ గమనించాడు. అతనికి ఆహారం ఇప్పించి బిల్లు కట్టాడు.
రవిశంకర్ అతని వివరాలు అడిగి తెలుసుకున్నాడు.. బిచ్చగాడి రూపంలో ఉన్న వ్యక్తి పేరు నిశాంత్ కుమార్ అని, తను మాజీ బ్యాంక్ ఉద్యోగి సచ్చిదానంద సింగ్ కొడుకు అని చెప్పాడు. అప్పటికే రవిశంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు వచ్చి అతను చెప్పిదంతా విన్నారు. అక్కడ బీహార్‌లోని నిశాంత్ కుమార్ స్నేహితులను, కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ తర్వాత నిశాంత్ తప్పి పోయి కొన్ని నెలలు గడుస్తున్నాయని తెలిపారు. రవిశంకర్ సింగ్ ఆవ్యక్తి ఫోటోను కుటుంబ సభ్యులకు పంపాడు.
తనపై వచ్చిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని..కొన్ని నెలల క్రితమే అతను కనిపించకపోవడంతో.. అతను చనిపోయాడని నిశాంత్ మామయ్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాడు. ప్రస్తుతం నిశాంత్ మానసిక పరిస్థితి బాగలేదని.. శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని.. పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వాళ్లు స్థానికులతో మాట్లాడగా.. 15 రోజులుగా వ్యక్తి ఇక్కడ తిరగుతూ ఉండడం చూశామని.. పోలీసులకు చెప్పారు. అయితే నిశాంత్ బీహార్ నుండి నోయిడాకు ఎలా చేరుకున్నాడో అని పోలీసులు ఇప్పడు ప్రయత్నిస్తున్నారు. విచారణకు భాగంగా భాగల్ పూర్ కు తీసుకెళ్లారు