SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Begging Scam In India Do You Know Their Earnings Per Month

అడుక్కోవడం పెద్ద స్కామ్! వీరి రోజూవారి సంపాదన ఎంతో తెలుసా?

ఈరోజుల్లో భిక్షాటన చేసేవాళ్ళు చాలా బాగుంటున్నారు. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి రోడ్డెక్కితే వాళ్ళ కంటే ధనవంతులు మరొకరు ఉండరేమో అన్నంత రిచ్ గా ఉంటున్నారు. మహా నగరంలో సొంతంగా ఒక అపార్టుమెంట్, ఖరీదైన కారు ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.. వారి సంపాదన ఏ రేంజ్ లో ఉందో అనేది. అయితే ఇదొక స్కామ్ అని మీకు తెలుసా? దేశంలో ఉన్న బెగ్గర్స్ అందరూ కలిసి నెలకు ఎంత స్కామ్ చేస్తున్నారో తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 18 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అడుక్కోవడం పెద్ద స్కామ్! వీరి రోజూవారి సంపాదన ఎంతో తెలుసా?

రైల్వేస్టేషన్లలో, బస్ స్టేషన్లలో, రోడ్ల మీద ట్రాఫిక్ కూడళ్ల దగ్గర బిచ్చగాళ్లు రోజూ ఎదురవుతుంటారు. వాళ్ళని మొదటిసారిగా చూసినవాళ్లు అయ్యో పాపం అని జాలిపడి డబ్బులు వేస్తారు. ఆ మనిషి ఏ రూపాయో వేస్తే ఆ బిచ్చగాడు పై నుంచి కింద దాకా చూస్తాడు. వాళ్ళకీ ఆత్మాభిమానం ఉంటుంది. ఈ మధ్య ఫోన్ పేలు, గూగుల్ పేలు కూడా పెట్టుకుని భిక్షాటన చేసుకుంటున్నారు. ఎంత బెగ్గర్ అయినా గానీ పనిలో ఉన్నప్పుడే బిచ్చగాడు.. డ్యూటీ దిగాక వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది. ఉదయం నుంచి చినిగిన బట్టలు వేసుకుని.. కాళ్ళు లేని వాడిలా నటిస్తూ బిచ్చమెత్తుకునే వ్యక్తి.. సాయంత్రం అవ్వగానే డ్యూటీ దిగేసి టిప్ టాప్ గా రెడీ అయ్యి అందమైన అమ్మాయిలకు లైన్ వేస్తారు. ఇలాంటి బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అందరిలానే సొంత ఇల్లు, కార్లు ఉండాలని కోరుకుంటారు, కొనుక్కుంటారు.

ఈరోజుల్లో సొంత ఇల్లు కొనడం మధ్యతరగతి వారికి ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ కొంతమంది బిచ్చగాళ్ళు మాత్రం చాలా సులువుగా సొంత ఇల్లు, కార్లు సంపాదించేస్తున్నారు. బిచ్చగాళ్ల దగ్గర డబ్బులు ఉండవు అనుకుంటే పొరపాటే. రామ్ బాయి అనే వృద్ధ మహిళ భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంటుంది. చూడ్డానికి ఈవిడ జాలి వేసేలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల ముందు బిచ్చమెత్తుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఈమె దగ్గరకు ఒక దొంగ వచ్చి ఆమె చేతిలో ఉన్న సంచిని ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దొంగను పట్టుకోగా అందులో రూ. 4 లక్షల కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ డబ్బు ఎక్కడిది? ఎలా సంపాదించావ్ అని పోలీసులు అడగ్గా భిక్షాటన ద్వారా సంపాదించిన సొమ్ము అని చెప్పింది. అంతేకాదు తన ఇంట్లో ఇంకా ఇలాంటి నోట్లు ఉన్నాయని చెప్పింది. ఒక వృద్ధురాలి దగ్గర అంత డబ్బు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఈమె ఒక్కర్తే కాదు చాలా మంది బెగ్గర్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ ఆదాయం వీరికి ఉంటుంది. మహా నగరాల్లో అపార్టుమెంట్లు కూడా ఉంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీరి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో అని. ఒకప్పుడు మామూలుగా ఉండే భిక్షాటన ఇప్పుడు ఇదొక ఇండస్ట్రీగా మారిపోయింది. అన్ని రంగాల్లో స్కాములు ఉన్నట్టే ఇందులోనూ స్కాములు ఉన్నాయి. దీన్ని బెగ్గర్స్ స్కామ్ అంటారు. నెలకు 180 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. సోషల్ సైంటిస్ట్ అయిన మహమ్మద్ రఫీ ఉద్దీన్ రెండు సంవత్సరాలు కష్టపడి సర్వే చేయగా 73 లక్షల మందికి పైగా ప్రజలు భిక్షాటన వృత్తి మీద బతుకుతున్నారు. నెలకు రూ. 180 కోట్లు సంపాదిస్తున్నారు. వీరి సంపాదనలో 20 శాతం ఆహారం కోసం, 30 శాతం చెడు అలవాట్లకు ఖర్చు పెట్టి మిగతా 50 శాతం పొదుపు చేస్తున్నట్టు సర్వేలో తేలింది. భిక్షాటన ముసుగులో సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు.

begger

మళ్ళీ వీళ్ళు ఒక ముఠాగా ఉంటారు. వీరికొక నాయకుడు ఉంటాడు. అతను చెప్పిన ప్రదేశంలో చెప్పిన వ్యక్తులు వెళ్లి భిక్షాటన చేయాలి. ఆ తర్వాత వచ్చిన దాంట్లో లీడర్ కి కమిషన్ ఇవ్వాలి. ఈ భిక్షాటన ముసుగులో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని కూడా ఇందులోకి లాగుతున్నారు. కొన్ని సినిమాల్లో చూసినట్టు బయట కూడా అలానే ఉన్నారు. బయట ఉంటున్నారు కాబట్టే సినిమాల్లో అలా చూపించారు. పేదరికం కారణంగా నిజంగా భిక్షాటన చేసేవారు కొందరైతే.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఇలా భిక్షాటన వృత్తిని ఎంచుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇండియాలోనే ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్.

ఇతను ముంబైలో ఉంటాడు. రోజుకు 8 గంటలు పని చేస్తూ రూ. 2 వేలు నుంచి రూ. 2500 సంపాదిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా నెలకు రూ. 75 వేల వరకూ సంపాదిస్తున్నాడు. ఈ సంపాదనతోనే ముంబైలో రూ. 80 లక్షలు విలువైన రెండు అపార్టుమెంట్లు కొనుగోలు చేశాడు. అలానే ఇతనికి ఒక షాప్ కూడా ఉంది. ఈ షాప్ ద్వారా నెలకు రూ. 10 వేలు రెంట్ వస్తుంది. భరత్ జైన్ తన తండ్రితో కలిసి స్కూల్ పిల్లల పుస్తకాలు కూడా అమ్ముతున్నాడు. ఇలా నెలకు రూ. లక్ష వరకూ సంపాదించేస్తున్నాడు. ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అయితే ఇతను ఇంత సంపాదించినా కూడా భిక్షాటన వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇతని ఆస్తి ఏడున్నర కోట్లు అని సమాచారం. పప్పు కుమార్ అనే బిచ్చగాడు బీహార్ లో ఉంటాడు. ఇతను కూడా నెలకు లక్షల్లో సంపాదిస్తాడు. వ్యాపారులకు అప్పు ఇచ్చే రేంజ్ ఇతనిది. ఇక మలానా ఖాన్ అనే తెలివైన బిచ్చగాడు ఉన్నాడు. ఇతను ఆటోలో ఓ ప్లేస్ కి వెళ్లి.. బిచ్చమెత్తుకుంటాడు. నెలకు లక్షల్లో సంపాదిస్తాడు. ఇలా దేశమంతా 73 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారు.

Tags :

  • Beggar
  • Beggar Bank
  • national news
  • Scam
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam