మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలతో అమాయకపు ప్రజల నుంచి ఎంతో కాజేశారు. ఇప్పటికే ఎన్నో మోసాలు వెలుగు చూశాయి. పార్ట్ టైమ్ జాబ్ అని, సినిమాలకు రివ్యూలు ఇవ్వాలి, ప్యాకింగ్ జాబ్ అంటూ ఎంతో మందిని మోసం చేశారు. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త మోసం వచ్చింది.
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం కచ్చితంగా అవకాశాలను వెతుకుతూ ఉంటాం. అయితే ఎలా వెతుకుతున్నాం? ఎవరిని సంప్రదిస్తున్నాం? ఎలాంటి పని చేయాలని చూస్తున్నాం? అనే ప్రశ్నలకు మీకు కచ్చితంగా సమాధానం తెలిసి ఉండాలి. లేని పక్షంలో ఎవరో విసిరే వలలో మీరు చిక్కుకోక తప్పదు.
దేశంలో ఇటీవల భారీగా స్కాంలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నలిక్కర్ బారన్ విజయ్ మాల్యా నుండి నిన్న వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ వరకు భారత బ్యాంకుల నుండి డబ్బుల తీసుకుని ఎగ్గొట్టిన వారే. ఈ స్కాంలన్నీ వారు విదేశాలు పరారయ్యాక వెలుగు చూశాయి. తాజాగా భారత్ లో మరో స్కాం వెలుగు చూసింది. అయితే ఈ స్కాంలో కంపెనీ ఉద్యోగులే.. సంస్థకు ఎసరు పెడుతున్నారు. అదే ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటో. అయితే సీఈఓ దీపిందర్ గోయల్ […]
ఫ్రెండ్ కోసం మంచి పని ఏం చేసినా, అది ఎంత కష్టమైనా చేయచ్చు. అంతేగానీ ఫ్రెండ్ కోసం చేస్తున్నామని చెప్పి తప్పులూ, నేరాలూ చేయకూడదు. బీహార్‌కి చెందిన ఒక యువకుడు తనకి జాబ్ రావడం కోసం ఫ్రెండ్‌ని రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌కి పంపించాడు. ఏకంగా తన బొటనవేలు చర్మాన్ని ఒలిచి మరీ ఫ్రెండ్ చేతికి అతికించాడు. కట్ చేస్తే ఫ్రెండు, ఫ్రెండ్ మాట విన్న ఇంకొక ఫ్రెండు ఇద్దరూ జైల్లో ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరలో ఆగస్ట్ 22న […]
పార్థ ఛటర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈయన పేరు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ఆయన మంత్రి పదవిని తొలగించడమే కాకుండా.. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనే ఇప్పటి వరకు రూ.50 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రి […]
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యతో పాటు మంత్రికి బాగా సన్నిహితురాలిగా చెబుతున్న అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అక్కడి వారికి ఆమె ఎవరు? మంత్రికి ఎంత క్లోజ్ అన్నది తెలుసు. కానీ దక్షిణాది వారు మాత్రం అసలు ఎవరీ అర్పితా ముఖర్జీ అని వెతుకులాట ప్రారంభించారు. అర్పితా ముఖర్జీ.. కాలేజ్ రోజుల్లో మోడల్ […]
మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా […]
అంతర్జాతీయ క్రికెట్ లో ఐపీఎల్ కున్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2008లో ఒక సాదా సీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ.. నేడు ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ లీగ్ గా మారిపోయింది. అలా ఐపీఎల్‌కు ఉన్న ఆదరణనే తమ ఆయుధంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు.. రష్యన్లను పెద్ద ఎత్తున మోసం చేశారు. ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించి.. బెట్టింగ్‌ల పేరిట ఆశచూపి అందినకాడికి దండుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ […]
Harsha Sai: ఇటీవల సోషల్ మీడియాలో మోడల్ కాజల్ అలియాస్ జుబేదా ఫాతిమా అనే మహిళ తెగవైరల్ అవుతోంది. చాలా పేదరికంలో ఉన్న కాజల్ ఆమె తల్లితో ఉంటుంది. తినడానికి తిండిలేక, సరైన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న కాజల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే.. కొద్దిరోజులుగా మోడల్ కాజల్ ని పలువురు యూట్యూబర్లు ఇంటర్వ్యూలు చేసి.. ఆమె పరిస్థితి, జీవితం ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయో బయటపెడుతూ వచ్చారు. మరికొందరు […]