రామాలయాలలో రామునికి తమవంతుగా విలువైన ఆభరణాలను, సీతమ్మకు నగలను, చీరలను సమర్పించి భక్తిని చాటుకుంటారు. అలాగే గుజరాత్‌లో కూడా 108 అడుగుల పొడవుతో బాహుబలి అగరబత్తిని తయారుచేసి తమ రామభక్తిని చాటుకున్నారు.
భారత దేశం హిందూ మతాన్ని ఆరాధించే దేశం. మన దేశంలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. ఆధ్యాత్మికతకు మారుపేరు. శ్రీరాముడు పాలించిన రాజ్యంగా పేరొందిన దేశం మనది. భరతుడు ఏలిన భరతఖండంగా భారతదేశంగా పేరొందింది. అందుకే ఇక్కడి నేలలో రామభక్తి పరవశిస్తుంది. రాముని సన్నిధిలో హనుమంతుడు కూడా పూజలు అందుకుంటాడు. సీతారాముల జీవిత సారాంశం రామాయణం. రామాయణంలోని ప్రతి ఘట్టం మన జీవితానికి దగ్గరి సంబంధం ఉంటుంది. వాటిని పాటించి ఆచరించాలని రామాయణాన్ని కథలుగా మలిచి స్కూల్లో పిల్లలకు పాఠాలుగా అమర్చారు. ఒక్కోసన్నివేశాన్ని వివరించే సమయంలో రామాయణం పాత్రలలోని గొప్పతనం తెలుస్తుంది. ఇలా రాముని గురించి చెప్పుకుంటూపోతే చాలా విషయాలు ఉన్నాయి. రామాలయాలలో రామునికి తమవంతుగా విలువైన ఆభరణాలను, సీతమ్మకు నగలను, చీరలను సమర్పించి భక్తిని చాటుకుంటారు. అలాగే గుజరాత్‌లో కూడా 108 అడుగుల పొడవుతో బాహుబలి అగరబత్తిని తయారుచేసి తమ రామభక్తిని చాటుకున్నారు.
గుజరాత్ వడోదరాలోని తర్సాలీకి చెందిన భక్తులు అయోధ్య రామునిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. అయోధ్య రామమందిరంలో ఇవ్వడం కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. దీని పొడవు 108 అడుగుల పొడవు ఉంది. 3403 కిలోల బరువుతో తయారు చేసి తమ రామభక్తిని చాటుకున్నారు. ఈ అగరబత్తిని తయారు చేయుటకు పంచద్రవ్యాలను ఉపయోగించారు. ఈ బాహుబలి అగరబత్తిని ఈ సంవత్సరం అయోధ్య రామమందిరానికి పంపాలని నిర్ణయించారు. ఈ అగరబత్తిని తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. విహాభాయ్ భర్వాడ్ నేతృత్వంలో ఈ అగరబత్తిని తయారు చేసారు. ఈ అతిపెద్ద అగరబత్తి దేవాలయం మొత్తం సువాసన వెదజల్లుతుందని.. ఈ అగరబత్తి కోసం పంచద్రవ్యాలను వాడామని విహాభాయ్ తెలిపారు.
ఈ సందర్భంగా విహాభాయ్ భర్వాడ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఈ బాహుబలి అగరబత్తిని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకెళ్తామని, అక్కడ భక్తులందరి సమక్షంలో వెలిగిస్తామని చెప్పారు. పంచ ద్రవ్యాలతో బాహుబలి అగరబత్తిని తయారుచేశామని, దీని పొడవు 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల చుట్టుకొలతలతో తయారు చేయబడిందని అన్నారు.191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామాగ్రి, 1,475 కిలోల ఆవు పేడను వాడారని ఆయన తెలిపారు. ఈ అగరబత్తి తయారీకి దాదాపుగా రూ. 5 లక్షలు ఖర్చయిందని, అగరబత్తిని తరలించడానికి రూ. 4.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయోధ్యకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను ఆహ్వానించి ముఖ్యమంత్రి సమక్షంలో రామమందిరంలో వెలిగిస్తామని విహాభాయ్ తెలిపారు.