భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ లో రాముడి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరిలో రాముడిని గర్భగుడిలో ప్రతిష్టించిన తర్వాత భక్తులకు దర్శనమిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రామ మందిరం ఎత్తు దాదాపు 161 అడుగులు, ఇందులో 360 స్తంబాలు ఏర్పాటు చేస్తున్నారు. మందిర నిర్మాణం పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని.. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇదిలా ఉంటే.. రామాలయానికి పలువురు భక్తులు కానుకలు అందజేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయోద్యలో భవ్యమైన రామ మందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్మాణం పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం ఉంచుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాలయానికి కానుకగా పలువురు భక్తులు తమకు తోచిన కానుకలు తీసుకువస్తున్నారు. కొంతమంది సీతారాముల విగ్రహాలు బంగారం, వెండితో తయారు చేసినవి కానుకలుగా సమర్పిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ తాళాల నిపుణుడు ఏకంగా 400 కేజీల బాహుబలి తాళం తయారు చేశారు. ప్రపంచంలో ఇంత పెద్ద తాళం బాహుషా ఎక్కడా ఉండదని అంటున్నారు. తాళాల నగరంలో పేరుగాంచిన అలీగఢ్ కి చెందిన సత్య ప్రకాశ్ శర్మ మొదటి నుంచి రామభక్తుడు. ఆయన తాళాల తయారీలో ఎంతో అనుభవజ్ఞుడు. సత్య ప్రకాశ్ కుటుంబం వందేళ్ల నుంచి తాళాల తయారీ పనులు చేస్తుంది. రామ మందిరానికి తన తరుపు నుంచి ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో అతిపెద్ద తాళం చేయించి కానుకగా ఇవ్వాలని భావించారు సత్యప్రకాశ్ శర్మ.
ఇందుకోసం ఆయన కొన్ని నెలల పాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారు చేసిన తాళాన్ని సిద్దం చేశారు. త్వరలో అయోద్య రామాలయ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. అయోద్య ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో ఉన్న తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారు చేశాని సత్య ప్రకాశ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం తాళానికి సంబంధించి కొన్ని ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. ఈ తాళం తయారీలో తన భార్య రుక్మిణి కూడా ఎంతో సహకరించిందని శర్మ అన్నారు. ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు వెచ్చించానని అన్నారు. సత్య ప్రకాశ్ శర్మ చేసిన తాళం చూపరులను భలే ఆకర్శిస్తుంది.. ఈ తాళం చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది.