రోడ్లను శుభ్ర చేయడమే చేస్తూ జీవనోపాది పొందుతున్న ఓ వ్యక్తికి బ్యాంకు అధికారులు నోటిసులు పంపారు. అందులో రూ.16 కోట్లు కట్టాలని పేర్కొన్నారు. అతడి నెల జీతం 15 వేలకు మించి ఉండదు. అలాంటి వ్యక్తికి ఈ భారీ నోటీసు రావడంతో షాక్ గురయ్యాడు. చివరకి..
రోడ్లను శుభ్ర చేస్తూ అతను జీవనోపాధి పొందుతున్నాడు. ఇక అతడి నెల జీతం 15 వేలకు మించి ఉండదు. ఇక కోట్ల రూపాయాలను చూడాలంటే కలే అనుకునే వారు ఆయన. ఇక ఎవరైన పొరపాటున కోటి రూపాయాలు కట్టమంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడి. అలాంటి ఊహించని సంఘటన అతడి జీవితంలో జరిగింది. రూ.16 కోట్ల రుణం ఉందని, వెంటనే చెల్లించాలని బ్యాంకు వాళ్లు నోటీసులు పంపారు. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆ నోటీసులు జారీ చేసిన బ్యాంకులో బాధితుడికి అకౌంట్ కూడా లేదు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
గుజరాత్ లోని వడదోర నగరంలో శాంతిలాల్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోస్తున్నాడు. అతడి జీతం మహా అయితే 15 నుంచి 20 వేల మధ్యలో ఉంటుంది. అతను ఒక్కసారి కూడా లక్ష రూపాయాలు కూడా చూడలేదు. అలాంటి వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆగ్రా (యూపీ) శాఖ నుంచి ఓ నోటీసు అందింది. మీకు ఆగ్రా శాఖకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.16 కోట్ల రుణం ఉందని, దానిని మార్చి 4 లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని అధికారులు నోటిసులో పేర్కొన్నారు.
ఒక వేళ మీరు రుణం చెల్లించనట్లయితే.. ఆస్తులను స్వాధీనం చేసుకుంటామనే హెచ్చరిక కూడా అందులో ఉంది. దీంతో శాంతిలాల్ తో పాటు అతడి కుటుంబం సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నోటీసులు చూసిన శాంతిలాల్ భార్య జాషిబెన్ సొమ్మసిల్లి పడిపోయింది. షాక్ నుంచి తేరుకున్న శాంతిలాల్ పంజాబ్ నేషనల్ బ్యాంకు వడోదర నగర శాఖ కార్యాలయానికి వెళ్లి అసలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో శాంతిలాల్.. స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రాను ఆశ్రయించి.. తనకు వచ్చిన నోటీస్ గురించి వివరించారు.
స్పందించిన ఎమ్మెల్యే చోప్రా.. బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించి.. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. శాంతిలాల్ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 లక్షల లోపే ఉంటాయని, అలాంటి వారు ఎలా రూ.16 కోట్లు అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. నోటీసు విషయం తాజాగా బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాశంమైంది. అయితే ఇది అధికారుల తప్పిందం వల్లనే వచ్చిందని భావిస్తున్నారు. అధికారుల తప్పిందంతో సామాన్యులు ఆందోళన పడుతున్న ఘటనలు అనేకం జరిగాయి. మరి.. తాజా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.