‘అవని చతుర్వేది‘ యుద్ధ విమానం ఒంటరిగా నడిపిన తొలి భారత మహిళ. భారత వాయుసేనలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ (యుద్ధ విమాన) పైలట్లలో అవని ఒకరు. మహిళలు సైన్యంలో చేరడానికే వెనకడుగు వేస్తున్న రోజుల్లో, ఆమె సైన్యంలో చేరడమే కాకుండా.. యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి ఔరా అనిపించింది. అవని తొలిసారిగా 2018, ఫిబ్రవరి 19న ‘మిగ్-21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపింది. భారత సైనిక దళాల చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయం. ఈ ధీర వనిత ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు.
ఇండియా, జపాన్ దేశాలు తొలిసారిగా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్‌డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ‘వీర్ గార్డియన్-2023’ పేరిట ఈ నెల 16 నుంచి 26 వరకు జపాన్‌లోని హ్యకురి, ఇరుమా ఎయిర్ బేస్‌ల పరిధిలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాల్లో పాల్గొనే భారత బృందంలో మహిళా ఫైటర్ పైలట్, స్కాడ్రన్ లీడర్ అయిన అవని చతుర్వేదికు చోటు లభించింది. ఆమె త్వరలోనే జపాన్‌కు బయల్దేరనున్నారు. దీంతో అవని అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. విదేశాల్లో భారత్ తరఫున యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ గా చరిత్ర సృష్టించనున్నారు.
Avani Chaturvedi pic.twitter.com/4oSHt2sQyx
— RVCJ Media (@RVCJ_FB) January 8, 2023
ప్రస్తుతం అవని సుఖోయ్ (ఎస్‌యూ-30 ఎంకేఐ) యుద్ధ విమాన పైలట్‌గా ఐఏఎఫ్‌కు సేవలందిస్తున్నారు. పటిష్ఠమైన దేశీయ ఆయుధ వ్యవస్థలతో కూడిన ఈ విమానం ఐఏఎఫ్‌లోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో ఒకటి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అవని, జైపూర్‌లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. అవని చతుర్వేదిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
1st IAF woman pilot to be part of wargames abroad; Meet Avani Chaturvedi#indianairforce #IAF #avanichaturvedi pic.twitter.com/oIXYzqHmJc
— Zee News English (@ZeeNewsEnglish) January 9, 2023