ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు ఇండ్లపై వచ్చి పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఇవి కొన్ని సార్లు మనుషులపై దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తుంటే అతనిపై చిరుత దాడి చేసి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో వద్ద ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తున్నాడు.. అదే సమయంలో ఒక్కసారే చెట్ల పొదల్లో నుంచి చిరుతపులి సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మీద దాడి చేసి రెప్పపాటులో వెనక్కి వెళ్లిపోయింది. తనపై ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో సైకిల్ పై ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర సైక్లిస్టులు, కార్లు ఆ దాడిని చూసిన తర్వాత కొద్దిసేపు ఆగిపోయాయి. చిరుత వెళ్లిపోగానే సైకిల్ వెనక్కి తిప్పి వచ్చిన దారి నుంచి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జనవరిలో ఈ దాడి జరిగిందని, పార్క్ అధికారులు కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలలో ఈ ఘటన బంధించబడిందని చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తూ.. సాదు జంతువులపై దాడులు చేస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That cyclist not able to believe on his luck !! @Independent pic.twitter.com/WVbDCMEpX6
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 15, 2022