గత కొన్ని రోజులుగా సినీ, కళా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసకుంటున్నాయి. ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాకారుడు, శిల్పి చెళియన్ అలియాస్ డి. నెదుంచెళియన్ ఆదివారం మృతి చెందారు. ఆయన 61 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. చెళియన్ తంజావూరు జిల్లాలో జన్మించాడు.1985లో కుంభకోణంలోని ప్రభుత్వ కళా మరియు క్రాఫ్ట్స్ కళాశాల నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పొందాడు.
ఇది కూడా చదవండి: చనిపోయాడని చెప్పిన డాక్టర్లు.. అంత్యక్రియలకు స్నానం చేయిస్తుండగా షాకింగ్ సీన్!
చెళియన్ రచనలు దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలలో ప్రదర్శించారు. అతను హాంకాంగ్, సింగపూర్, మలేషియాలో అనేక వన్-మ్యాన్ షోలు, గ్రూప్ షోలను నిర్వహించాడు. ఇవి కాకుండా, ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్, కుముదం, ఆనంద వికటన్ వంటి పలు మ్యాగజైన్లకు చెలియన్ రచనలు చేశాడు. అతను ఐదు పుస్తకాలను కూడా ప్రచురించాడు. చెలియన్ 2013లో రాజరాజన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి సెవలియార్ శివాజీ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. ఆయన మృతి పట్ల కళా రంగ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాడెపై శవంలా ఆలయానికి వచ్చిన భక్తుడు! ఎందుకంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.