కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకారులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియ(పీఎఫ్ఐ)కి చెందిన కొందరు వ్యక్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్‌కు చెందిన సభ్యుల అరెస్టుకు నిరసనగా శుక్రవారం పూణెలో ఈ పీఎఫ్ఐకి చెందిన సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడకు చేరుకున్న నిరసనకారులను నిర్భందించి వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. అయితే ఆ సమయంలో కొందరు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
దాదాపు 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫేఐఆర్లో రియాజ్ సయ్యద్ అనే వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నిరసనకు పాపులర్ ఫ్రంట్ సభ్యులు ఎలాంటి అనుమతులు తీసుకోలదని.. ఇలా పర్మిషన్ లేకుండా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసేందుకు వీలు లేదంటూ పోలీలులు హెచ్చరించారు. తాము 60 మందిపై కేసు నమోదు చేశామని.. ఇప్పటికే 41 మందిని అదుపలోకి తీసుకున్నామంటూ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంకర్ మీడియాకు వెల్లడించారు. తాము నిరసన చేయకండని ముందే హెచ్చరించినా కూడా తమ మాటలను ఖాతరు చేయలేదంటూ చెప్పుకొచ్చారు.
Maharashtra | Case registered against a man named Riyaz Sayyad along with 60-70 other PFI workers in Pune city for unlawful gathering to protest in front of District Collector office yesterday over NIA raids on PFI: Pune Police
— ANI (@ANI) September 24, 2022
ఈ నెల 21, 22న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. పాపులర్ ఫ్రంట్ ఇండియాకి అనుబంధంగా ఉన్న సంస్థలు, కార్యాలయాలపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. బిహార్, కేరళా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ- ఈడీ సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించాయి. ఎన్ఐఏ దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకుచెందిన వాళ్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు. పూణెలో మాత్రం శ్రుతి మించి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Maharashtra: ‘Pakistan Zindabad’ slogans were heard outside the District Collector’s office yesterday in Pune City where PFI cadres gathered against the recent ED-CBI-Police raids against their outfit. Some cadres were detained by Police; they were arrested this morning. pic.twitter.com/XWEx2utZZm
— ANI (@ANI) September 24, 2022
Thiruvananthapuram, Kerala | One auto-rickshaw and a car were damaged allegedly by people supporting the state-wise bandh called today by the Popular Front of India over NIA raids pic.twitter.com/k305OP83jW
— ANI (@ANI) September 23, 2022