ఈ మద్య చిన్న విషయాలకే మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు నిర్ణయాలతో బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం.. క్షణికావేశంలో ఎదుటివారిని చంపడం లేదా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అక్రమ సంబంధాల కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీస్ అధికారులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినపుడు కుటుంబ పెద్దలతో కానీ, మనల్ని ప్రేమించే ఆత్మీయులతో కానీ బాధలు చెప్పుకుంటే సమస్యలు కొంతవరకు పరిష్కరించుకోవచ్చని.. ప్రతి విషయానికి ఆత్మహత్యలు ఒక్కటే పరిష్కారం కావని సైకాలజిస్టులు అంటున్నారు. తాజాగా ఓ ఉన్నత పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్ తో కాల్చడమేకాదు.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పూణే లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా భరత్ గౌక్వాడ్ విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన మానసికంగా తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తీవ్ర డిప్రేషన్ లో తన భార్య మోనీ(44), మేనల్లుడు దీపక్ (35) లను సర్వీస్ రివాల్వర్ తో కాల్చాడు. ఆ తర్వాత తాను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారజామున జరిగినట్లు తెలుస్తుంది. తుపాకీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా సంచలనంగా మారింది.
భరత్ గైక్వాడ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ముగ్గురిని జూపిటర్ హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గైక్వాడ్ అమరావతి లో తన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకునన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాల్పులకు కారణం మానసిక ఒత్తిడా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఉన్నత హూదాలో ఉంటూ ఎంతో మంచి భవిష్యత్ ఉన్న అధికారి ఇలా తన భార్య, మేనల్లుడిని కాల్చి, తాను కాల్చుకొని చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tragic Murder-Suicide in Pune: Senior Cop Kills Wife and Nephew before taking own Life; Motive not disclosed.#feedmile #BharatGaikwad #ACP #maharashtra #pune #shot #wife #nephew #gun #shooting #breakingnews pic.twitter.com/o8Bb13i3y3
— Feedmile (@feedmileapp) July 24, 2023