ఎస్ఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లో భాగంగా జరుగుతున్న పరీక్షలో కొందరు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. వారు చేస్తున్న హైటెక్ మోసానికి అధికారులు నివ్వెరపోయారు. నింధితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశంలో అక్కడక్కడ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీలు, మాస్ కాపీయింగ్ సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని సాధించే క్రమంలో అడ్డదార్లు తొక్కుతున్నారు. ఎలాగైన ఉద్యోగం సాధించి స్థిరపడాలని అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెరలేపుతున్నారు. తెలంగాణ లో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడే ఆశావాహులు ఆధునిక టెక్నీలజీని వాడుకుని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో జరిగిన పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఆ వివరాలు..
పూణే నగరంలో ఇటీవల స్టేట్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) రిక్రూట్ మెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో కొందరు అభ్యర్థులు అతి తెలివి ప్రదర్శించి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఎగ్జామ్ హాల్ లో పరీక్ష రాస్తున్న నలుగురు అభ్యర్ధులు బ్లూటూత్ మైక్రోఫోన్‌లు మరియు స్పై కెమెరాలను ఉపయోగించి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను ఉపయోగించి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులను గుర్తించి అధికారులు ఖంగు తిన్నారు. వారు తమ చెవుల్లో ఇయర్ బడ్స్, మైక్రో ఫోన్లను అమర్చుకుని కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఓ అభ్యర్థి చెవిలో బ్లూటూత్ మైక్రో ఫోన్లు గుర్తించి బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడిన నిందితులను యోగేష్ రాంసింగ్ గుసింగే (19), సంజయ్ సులానే (19), యోగేష్ సూర్యభాన్ జాదవ్ (25), లఖన్ ఉదయ్‌సింగ్ నయమానే (21)లుగా గుర్తించారు. వెంటనే అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నింధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీటింగ్ రాకెట్ వెనకాల ఉన్నదెవరు? ఎంత కాలం నుంచి చీటింగ్ లకు పాల్పడుతున్నారు? అన్న కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.
#WATCH: Four individuals were apprehended during the #SRPF exam in #Pune for using hi-tech cheating tactics, including Bluetooth microphones in their ears and spy cameras in shirt buttons. pic.twitter.com/4Y1VXCYJh5
— Free Press Journal (@fpjindia) July 25, 2023